English | Telugu

ముచ్చటగా మూడోసారి వెంకటేశ్, నయనతార

విక్టరీ వెంకటేశ్, నయనతారల క్రేజీ కాంబినేషన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో లక్ష్మీ, తులసి సినిమాలో నటించిన ఈ జంట.. ఇప్పుడు మళ్లీ మరో సినిమాలో నటించనున్నారు. చిన్న సినిమాల దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న మారుతి ఈ సినిమాకి దర్శకత్వం వహించనుండగా..హారిక హాసిని చినబాబు నిర్మాతగా వ్యవహరించనున్నారు. అయితే గతంలోనే మారుతి విక్టరీ కోసం ఓ కథను తయారు చేయగా అది కాస్త మిస్ అయింది. అయితే ఇప్పుడు మరింత కసిగా వెంకీతో సినిమా తీయాలని పట్టుబట్టి వెంకీకి ఫర్పెక్ట్ గా సూటయ్యే కథను తయారుచేశాడు. డిసెంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. ప్రస్తుతానికి హారిక హాసిని చినబాబు త్రివిక్రమ్ –నితిన్, చందు మొండేటి - నాగచైతన్యలతో సినిమాలు నిర్మిస్తుండగా.. ఇప్పుడు ఇది ముడో చిత్రం అవుతుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.