English | Telugu
కొరటాల కూడా 10 కోట్ల క్లబ్ లో?
Updated : Oct 30, 2015
కొరటాల శివ ప్రస్తుతం మంచి ఫాం లో ఉన్న డైరెక్టర్ అని వేరే చెప్పనవసరం లేదు. మిర్చి సినిమాతో మంచి హిట్ అందుకుని, శ్రీమంతుడు సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న కొరటాల శివకు మంచి టైమ్ వచ్చింది. ఇప్పుడు తను కూడా పదికోట్ల క్లబ్ లో చేరిపోయాడు. టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లు వినాయక్, త్రివిక్రమ్, శ్రీను వైట్ల, బోయపాటి శ్రీను ఇంకా ఒకరిద్దరు పదికోట్ల పారితోషికం తీసుకుంటుండగా.. ఇప్పుడు ఆ ఖాతాలో కొరటాల కూడా చేరిపోయినట్టు తెలుస్తోంది. కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని తెలిసిందే. ఈ సినిమాకు గాను కొరటాలకు పదికోట్లు రెమ్యునరేషన్ అందుతున్నట్టు తెలుస్తోంది. చాలా తక్కువ టైంలోనే ఈ రేంజ్ కు చేరిన కొరటాలకు.. ఈ సినిమా కూడా హిట్ అయితే అతని రెమ్యునరేషన్ ఏ 15 కోట్లుకు చేరుతుందో.