English | Telugu

వెంకటేష్, త్రిష జంటగా చిత్రం

వెంకటేష్, త్రిష జంటగా ఒక చిత్రం ప్రారంభం కానుందని సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, విక్టరీ వెంకటేష్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఒక చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. గతంలో వెంకటేష్, త్రిష జంటగా "ఆడవారి మాటలకు అర్థాలు వేరులే", "నమో వెంకటేశా" అనే చిత్రాల్లో నటించారు. ఇది వెంకటేష్, త్రిష కలసి నటిస్తున్న మూడవ చిత్రం కావటం విశేషం.

ఈ చిత్ర దర్శకుడు మలినేని గోపీచంద్ గతంలో రవితేజ హీరోగా నటించిన "డాన్ శీను" అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. డాన్ శీను ఘనవిజయం సాధించింది. ఆ చిత్రం తర్వాత మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదే కావటం విశేషం. వెంకటేష్ హీరోగా, త్రిస్హ హీరోయిన్ గా, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో, బెల్లంకొండ సురేష్ నిర్మించే ఈ చిత్రం ఏప్రెల్ నెల మొదటి వారంలో ప్రారంభం కానుందని తెలిసింది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.