English | Telugu
ప్రముఖ నటుడు, దర్శకుడి మృతి
Updated : Jul 18, 2025
ప్రభు, అమల జంటగా 1989 లో వచ్చిన 'నాళై మణితన్' అనే చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటాడు 'వేలు ప్రభాకరన్'(Velu Prabhakaran). ఆ తర్వాత అరుణ్ పాండ్యన్, రోజాతో తెరకెక్కించిన సైలెన్స్ ఫిలిం 'అసురన్' తో పాటు 'కాదల్ కాదల్' అనే సినిమాలు దర్శకుడిగా ప్రభాకరన్ కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2017 లో తనకంటే వయసులో 30 సంవత్సరాల వయసు తక్కువ గల 'కాదల్ కాదల్' మూవీ ఫేమ్ 'షిర్లీ దాస్'(Shirley Das)ని వివాహం చేసుకోవడం జరిగింది.
ప్రభాకరన్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతు చెన్నైలోని ఒక ప్రవైట్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. పరిస్థితి విషమించడంతో ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఎల్లుండి అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం ఆయన వయసు 68 సంవత్సరాలు. నటుడిగా కొన్ని సినిమాల్లో నటించిన ప్రభాకరన్, చివరిసారిగా మే 9 న రిలీజైన 'గజానా'లో ఒక క్యారక్టర్ ని పోషించాడు.
కెమెరామెన్ గా కూడా సుమారు పది సినిమాలకి పైగానే పని చెయ్యగా, దర్శకుడిగా పన్నెండు చిత్రాలని తెరకెక్కించాడు.