English | Telugu
కిరీటి అసలైన బ్యాక్ గ్రౌండ్ ఇదే.. ఎంతో మందికి అండగా ఉన్నాడు
Updated : Jul 18, 2025
ఈ రోజు తెలుగుతో పాటు కన్నడ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'జూనియర్(Junior)'. ప్రతిష్టాత్మక బ్యానర్ 'వారాహి' సంస్థ నిర్మించిన ఈ చిత్రం ద్వారా 'కిరీటి'(Kireeti)హీరోగా తొలిసారి సినీ ఆరంగ్రేటమ్ చేసాడు. శ్రీలీల హీరోయిన్ కాగా ఒకప్పటి కన్నడ స్టార్ హీరో 'రవిచంద్రన్'(Ravi Chandran)కిరీటి తండ్రిగా కనిపించడం విశేషం. రాధాకృష్ణ రెడ్డి (Radhakrishna Reddy)దర్శకుడిగా వ్యవహరించగా, దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad)సంగీతాన్ని అందించాడు.
ఇక ఈ మూవీ ప్రచార చిత్రాలు రిలీజైన దగ్గర్నుంచి 'కిరీటి' గురించి ప్రత్యేకమైన చర్చ నడుస్తుంది. దీంతో చాలా మంది కిరీటి బ్యాక్ గ్రౌండ్ గురించి 'గూగుల్' లో సెర్చ్ చేస్తున్నారు. కిరీటి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన బిజెపి పార్టీ సభ్యుడు మాజీ మంత్రి 'గాలి జనార్దన్ రెడ్డి'(Gali Janardhan Reddy)కి ఒక్కగానొక్క కొడుకు. తల్లి పేరు అరుణ లక్ష్మి. కొన్ని కోట్ల ఆస్తులకి ఏకైక వారసుడు. సోదరి బ్రాహ్మణికి చాలా సంవత్సరాల కిందటే వివాహం జరుగగా, ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోనే బిజినెస్ పనులు చూసుకుంటు ఉంది. కిరీటి విద్యాబ్యాసం ఇంటర్ వరకు బెంగుళూర్ లోనే జరగగా, ఆ తర్వాత లండన్ లో 'హానర్స్ అండ్ పాలిటిక్స్ లో బిజినెస్ మేనేజ్ మెంట్' చేసాడు.
నటనలో ఎన్టీఆర్, పునీత్ రాజ్ కుమార్ ని ఇష్టపడే కిరీటి కి చిన్నపట్నుంచి హీరో కావాలని ఉండేది. ఆ దిశగానే ఎంతో కష్టపడి డాన్స్, ఫైట్స్ లో శిక్షణ పొందాడు. మెంటల్లీ ఛాలెంజెడ్ స్పెషల్ ఏబిల్డ్ పిల్లలు ఆరువందల మంది దాకా చదివిస్తున్నాడు. 250 మంది వృద్దులకు ఆశ్రయం కల్పించాడు. రాజకీయాల్లో మాత్రం ఆసక్తి లేదు. మంచి నటుడుగా నిబడాలనేది కిరీటి లక్ష్యం. ఇక జూనియర్ మూవీలో కిరీటి పెర్ ఫార్మెన్స్ , డాన్స్ లకి మంచి పేరు వస్తుంది.