English | Telugu

రవితేజ "వీర" హైదరాబాద్ లో

రవితేజ హీరోగా నటిస్తున్న"వీర" చిత్రం యొక్క షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతూంది. వివరాల్లోకి వెళితే శాన్వి ప్రొడక్షన్స్ పతాకంపై, మాస్ రాజా రవితేజ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, "రైడ్" ఫేం రమేష్ వర్మ దర్శకత్వంలో, గణేష్ ఇంటూరి నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "వీర". ఈ "వీర"చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబోలిలోని వై యస్ ఆర్ స్టేడియమ్ లో జరుగుతూంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పక్కా మాస్ పాత్రలో నటిస్తూంది.

కాజల్ అగర్వాల్ పాత్ర పేరు"కబడ్డీ చిట్టి". ఈ "వీర" చిత్రంలో నటిస్తున్న తాప్సి మాత్రం క్లాస్ పాత్రలో ఐ టి ప్రొఫెషనల్ గా నటిస్తూందని సమాచారం. ఈ "వీర" చిత్రం షూటింగ్ ముందు రామోజీ ఫిలిం సిటీలోనూ, మొన్నటి వరకూ స్టీల్ సిటీ విశాఖ పట్టణంలో, అరకు లోయ తదితర ప్రాంతాల్లో జరిగింది. ఈ చిత్రం తనకు ష్యూర్ షాట్ హిట్టని ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న రవితేజ అభిప్రాయపడుతున్నారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.