English | Telugu

జగపతిబాబు ఫాదర్ విబి రాజేంద్ర ప్రసాద్ ఇక లేరు

ప్రముఖ దర్శకుడు, నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ప్రముఖ తెలుగు సినీ నటుడు జగపతిబాబు తండ్రే ఈ వీబీ రాజేంద్రప్రసాద్‌. తనయుడు జగపతిబాబు పేరు మీదనే ‘జగపతి ఆర్ట్‌ పిక్చర్స్‌’ బ్యానర్‌ని స్థాపించి, ఆ బ్యానర్‌పై పలు విజయవంతమైన చిత్రాల్ని రాజేంద్రప్రసాద్‌ నిర్మించారు. ఆయన 1932, నవంబర్ 4న కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. రాజేంద్రప్రసాద్‌ 1965లో నిర్మించిన అంతస్తులు సినిమాకు (ఉత్తమ చిత్రం) జాతీయ అవార్డు మరియు ఫిలిం ఫేర్ అవార్డు కూడా అందుకొన్నారు. ఆ తరువాత 1966లో నిర్మించిన ఆస్తిపరులు సినిమాకు మళ్ళీ ఫిలిం ఫేర్ అవార్డు అందుకొన్నారు. ప్రతిష్టాత్మకమయిన రఘుపతి వెంకయ్య అవార్డు, కెవి రెడ్డి అవార్డు కూడా అందుకొన్నారు.ఆయన ఆరాధన, ఆత్మబలం, అంతస్తులు, అదృష్టవంతులు, దసరాబుల్లోడు, సింహ స్వప్నం మొదలయిన 16సినిమాలను స్వయంగా నిర్మించారు. దసరా బుల్లోడు, బంగారు బాబు, భార్య బర్తల బంధం, బంగారు బొమ్మలు, మంచి మనసులు వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.