English | Telugu
చక్రిని భార్యే చంపేసిందా?
Updated : Jan 12, 2015
తెలుగు సినిమా సంగీత దర్శకుడు చక్రి మరణం వివాదంగా మారి రోజుకో మలుపు తిరుగుతోంది. తన భర్త చక్రిని వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులే చంపారని చక్రి భార్య శ్రావణి జూబ్లీహిల్స్ పోలీసులకు పిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే దానికి కౌంటర్ గా చక్రి తల్లి విద్యావతి కూడా శ్రావణిపై అదే విధంగా ఆరోపణలు చేసింది. చక్రిని తానే చంపానంటూ శ్రావణి తమకు ఫోన్ చేసి చెప్పిందని, ఆమె కాల్ డాటా తీసి చూసినట్లయితే ఆ విషయం బయటపడుతుందని చక్రి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తాము శ్రావణిని ఎప్పుడూ వేధించలేదని,ఆమె తమను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని బెదిరిందించిందని, వెళ్లకపోతే చక్రిని చంపేస్తానంటూ బెదిరించడంతో విధిలేని పరిస్థితుల్లో తాము ఇల్లు వదిలి బయటకు వచ్చేశామని, అయినప్పటికీ శ్రావణి తన కొడుకును హత్య చేసిందని వారు ఆరోపించారు. ఇప్పటికైన పోలీసులు ఈ కేసుపై ఫాస్ట్ గా రియాక్ట్ అయి దృష్టి పెడితే కానీ ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు.