English | Telugu
వరుణ్ తేజ్ సినిమాల్లోకి అందుకే వచ్చాడట..!
Updated : May 7, 2016
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమాల్లోకి రావడం వెనుక ఒక వ్యక్తి కారణమట. ఆ వ్యక్తి చెప్పిన కారణంగానే సినిమాలపై ఇష్టం పెరిగిందట. ఇంతకూ ఆ వ్యక్తి ఎవరు అనేదేగా మీ డౌట్. ఇంకెవరు..మెగాస్టార్ చిరంజీవే. చిరంజీవి వరుణ్ ను సరదాగా ఫోటోలు తీస్తూ, అతనిది ఫోటోజనిక్ ఫేస్ అని సినిమాల్లోకి వెళ్లమని ఖచ్చితంగా చెప్పారట. అప్పటి వరకూ సినిమాల మీద పెద్ద ఆసక్తి లేని వరుణ్ అసలు సినిమాల్లోకి రాకూడదనుకున్నాడట. కానీ ఆ తర్వాతి నుంచే సినిమాల కోసం శిక్షణ తీసుకోవడం మొదలెట్టాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ సెలక్షన్ నుంచి, సినిమా తెరకెక్కిన తర్వాతి వరకూ, ప్రతీ డిపార్ట్ మెంట్ మీదా గ్రిప్ ఉండేలా చూసుకుంటున్నాడు వరుణ్. కెరీర్ ను చాలా పెర్ఫెక్ట్ ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే వరుణ్ నటించిన కంచె సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కే కాలేజ్ లవ్ స్టోరీ నటిస్తున్నాడు మెగా ప్రిన్స్..