English | Telugu
ఇళయరాజా పై సొంత తమ్ముడి విమర్శలు..!
Updated : May 7, 2016
భారతీయులందరూ గర్వించే సంగీత దర్శకుల్లో అగ్రగణ్యుడు ఇళయరాజా. ఆయన గురించి పాజిటివ్ గానే తప్ప, నెగటివ్ గా ఎప్పుడూ ఈ వార్తా రాదు. అంతటి సౌమ్యుడు. కానీ రీసెంట్ గా ఆయన తమ్ముడు గంగై అమరన్ రాజామీద విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. విషయంలోకి వెళ్తే, తమిళ సినిమా తారై తాపట్టై సినిమాకు ఇళయరాజాకు ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడు అంటూ జాతీయఅవార్డు ప్రకటించారు. ఐతే ఇళయరాజా మాత్రం, పాటలు వేరు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వేరు అంటూ అవార్డులు ఇవ్వడం కరెక్ట్ కాదని, తనకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే అవార్డు ఇస్తే అవమానంగా భావిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసి, తనకు అవార్డు వద్దంటూ తిరస్కరించారు.
ఇదే విషయంపై ఆయన మీద తమ్ముడు గంగై అమరన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జాతీయ పురస్కారం వచ్చిందని తమిళులందరూ ఆనందపడుతుంటే, అవార్డును తిరస్కరించి అందరి మనోభావాలను రాజా దెబ్బతీశారని, అందరూ తలదించుకునేలా చేశారని విమర్శించారు. సినిమాలో పాటలు అవార్డులు ఇవ్వాల్సినంత గొప్పగా లేవని, అందుకే బ్యాగ్రౌండ్ కు మాత్రమే అవార్డ్ వచ్చిందని ఆయన అన్నారు. గత కొంత కాలంగా, అన్నదమ్ములిద్దరికీ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అగ్ర సంగీతదర్శకుడి సొంత తమ్ముడే తూలనాడటం, తమిళనాట చర్చనీయాంశంగా మారింది.