English | Telugu
అత్తారింటికి వెళుతున్న పవన్ కళ్యాణ్..!
Updated : May 7, 2016
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తగారింటికి వెళుతున్నాడు. ఇదేంటి ఇప్పుడు వెళ్లడం అనుకుంటున్నారా..? గత కొద్ది రోజులుగా షూటింగ్‌లు, ఆడియో వేడుకలల్లో బిజీ బిజీగా గడిపిన పవర్‌స్టార్ సేద తీరాలనుకుంటున్నారు. అందుకే తన సతీమణి అన్నాలెజ్‌హెన్వా, కూతురు పోలేనాతో కలిసి రష్యా వెళుతున్నారు. పవన్ భార్య అన్నా లెజ్‌హెన్వా స్వస్థలం రష్యా. అక్కడ కొన్ని రోజులు కుటుంబంతో గడపాలనుకుంటున్నారు పవర్ స్టార్. రష్యా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎస్.జె సూర్య డైరెక్షన్‌లో తెరకెక్కనున్న సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు పవన్.