English | Telugu
అలిపిలో వరుణ్ పూజా రొమాన్స్
Updated : Apr 3, 2014
"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మెగా బ్రదర్ తనయుడు వరుణ్ తేజ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. కొచ్చిన్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ ప్రస్తుతం అలిపిలో చిత్రీకరణ చేస్తున్నారు. ఇందులో వరుణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి "ఆరడుగుల బుల్లెట్టు", "గొల్లభామ" అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.