English | Telugu
నేడే రౌడీ విడుదల
Updated : Apr 4, 2014
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, విష్ణు ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం "రౌడీ". రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు(శుక్రవారం 04, 2014) ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. పూర్తీ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని AV పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫాక్టరీ బ్యానర్లలో నిర్మాతలు విజయ్ కుమార్.ఆర్, పి.గజేంద్ర నాయుడు, ఎం.పార్థసారథి నాయుడు సంయుక్తంగా నిర్మించారు. సాయి కార్తీక్ సంగీతాన్ని అందించాడు. జయసుధ, శాన్వి కథానాయికలు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.