English | Telugu

సైన్యంలో చేర‌బోతున్న మెగా హీరో

హైటు.. ఆర‌డుగుల కంటే రెండించులు ఎక్కువే! ష‌ర్టు విప్పితే సిక్స్‌ప్యాక్ ప‌ర్స‌నాలిటీ. కండ‌లు తిరిగిన దేహం... కొట్టాడంటే ఇక అంతే సంగ‌తులు. ఇన్ని క్వాలిటీస్ ఉన్న మెగా హీరో వ‌రుణ్‌తేజ్ కాక‌పోతే ఇంకెవ‌రు..?? ఆ బాడీని బీభ‌త్సంగా వాడేసుకోవ‌డానికి క్రిష్ రెడీ అయిపోయాడు. ముకుంద‌తో ఎంట్రీ ఇచ్చిన వ‌రుణ్‌.. ఇప్పుడు క్రిష్‌తో జ‌త‌క‌ట్ట‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈనెల 27న ఈ చిత్రం లాఛ‌నంగా ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఎక్స్ క్లూజీవ్ డిటైల్స్ ఏంటంటే.. ఇందులో వ‌రుణ్ ఓ సైనికుడిగా న‌టిస్తున్నాడు. ఇది రెండో ప్ర‌పంచ యుద్దానికి సంబంధించిన క‌థ‌. హిట్ల‌ర్ సైన్యంలో వ‌రుణ్ ఓ సైనికుడు. అప్ప‌టి వాతావ‌ర‌ణాన్ని తెర‌పై ప్ర‌తిబింబిస్తూ.. మ‌ధ్యలో ఓ ప్రేమ‌క‌థ‌ని న‌డిపించ‌బోతున్నాడు క్రిష్‌. క్రిష్ సినిమా అంటే మాన‌వ‌సంబంధాలు, దేశ‌భ‌క్తి.. ఇలాంటి మ‌హోన్న‌త‌మైన అంశాలుంటాయి. ఈ క‌థ‌లోనూ ఆ మార్క్ క‌నిపించ‌బోతోంది. అయితే క్రిష్ ఈ సినిమాని పూర్తిస్థాయి క‌మ‌ర్షియ‌ల్ సినిమాగా తీర్చిదిద్దే ప్ర‌య‌త్నం చేయ‌బోతున్నాడు. మ‌రి సైనికుడిగా వ‌రుణ్ ఎలా ఉంటాడో.. దేశ‌భ‌క్తిలో క్రిష్ క‌మ‌ర్షియ‌ల్ అంశాలు ఎలా జోడిస్తాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి.