English | Telugu

"కంచె" పాటలకి "కంచె"పడ్డట్టయింది

సినిమాలో పాటలు హిట్టయితే సినిమా సగం హిట్టయినట్టే ఉంది ప్రస్తుత సినిమాల పరిస్థితి. సినిమాలో పాటలు బావుంటే ఆటోమెటిక్ గా వాటిని శ్రోతలు వింటారు. కాస్త స్లోగా ఉన్న పాటల కంటే కాస్తంత ఊపు ఉన్న పాటలనే ఎక్కువగా వింటారు.. నలుగురి నోళ్లలో నానుతాయి.

ముఖ్యంగా పాటల ప్రమోషన్ విషయంలో రేడియా ప్రమోట్ చేసినంత ఇంకెవరూ చేయరు. బావున్న పాటలని రిపీట్ చేస్తూ వేస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు "కంచె' సినిమా పరిస్థితి వేరేలా ఉంది. ఈ సినిమాలో పాటలు అంతలా శ్రోతలన్ని ఆకట్టుకోలేకపోయాయి. ఈ సినిమాకి చిరంతన్ భట్ అందించిన మ్యుజిక్ ఏదో నెరేషన్ లో భాగంగా ఉన్నాయే తప్పా వాటిలో అంత మేటర్ లేదని అనుకుంటున్నారు.

అంతేకాదు "కంచె" సినిమాలో పాటలని రేడియోలో ప్రమోట్ చేయడానికి కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదట. ఇప్పుడు చేస్తుంది కూడా దర్శకుడు క్రిష్ మీద ఉన్న గౌరవంతోనే తప్ప వాటిలో మాస్ అప్పీల్ ఏం లేదని అంటున్నారట. పైగా సినిమా రిలీజ్ డేట్ కూడా వాయిదా పడటంతో ఇప్పుడు అసలు ఎఫ్.ఎం.లు "కంచె" ఆడియోని పట్టించుకోవడం లేదు సరికదా.. తిరిగి రిపీటెడ్ గా కూడా వేయడం లేదట.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.