English | Telugu
' వంగవీటి ' టైటిల్ ఫస్ట్ లుక్
Updated : Feb 25, 2016
ఎన్ని బెదిరింపులు వచ్చినా, వెనక్కి తగ్గేదే లేదంటున్నారు రాం గోపాల్ వర్మ. తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న వివాదాస్పద చిత్రం వంగవీటి. ఇప్పటికే ఈ సినిమా ద్వారా చాలా వివాదాలను క్రియేట్ చేశారు వర్మ. దీంతో విజయవాడ ప్రాంతం నుంచి ఆయనకు చాలా బెదిరింపులు వచ్చాయి. అయినా, ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడేది లేదని పబ్లిగ్గానే చెప్పిన వర్మ, తాజాగా వంగవీటి టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
వర్మకు లైఫ్ ఇచ్చింది శివ లోని సైకిల్ చైన్ సీన్. బహుశా ఆ సెంటిమెంట్ ను ఫాలో అయ్యారో ఏమో కానీ, టైటిల్ ను పెద్ద పెద్ద అక్షరాలుగా , వాటన్నింటినీ సైకిల్ చైన్ తో కలిసి ఉన్నట్టు డిజైన్ చేశారు. పక్కన ఒక ఎర్రజెండా, టైటిల్ పైన రక్తపు మరకలున్న కత్తి కూడా ఉన్నాయి. తన సినిమాలో ఏమేం ఉండబోతున్నాయో, టైటిల్ డిజైన్ ద్వారా చెప్పకనే చెప్పారు వర్మ. హత్యలు, విద్యార్ధుల మధ్య గొడవలు, కమ్యూనిజం లాంటి విషయాలతో వంగవీటి తెరకెక్కబోతోందని టైటిల్ బట్టి అర్ధమవుతోంది. మరిప్పుడు ఈ టైటిల్ మీద ఇంకెన్ని వివాదాలు వస్తాయో చూడాలి..