English | Telugu
నేను తీవ్రవాదిని కాదు మొర్రో
Updated : Feb 25, 2016
ప్రముఖ బాలీవుడ్ హీరో/విలన్ సంజయ్‌దత్ ఇవాళ తన శిక్షను పూర్తిచేసుకుని బయటకు వచ్చాడు. అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్న కేసులో సంజయ్‌దత్‌కు అయిదు సంవత్సరాల కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే! 1993లో ముంబైలో జరిగిన బాంబుపేలుళ్ల ఘటనకు కారకులైన నిందితులతో సంజయ్‌దత్‌కు సంబంధాలు ఉన్నాయన్న కారణంగా ఆయనను అప్పట్లో అరెస్టు చేశారు. ఆ సమయంలో ఆయన వద్ద ఏకే-56 గన్ కూడా లభ్యమైంది. అయితే తుపాకుల మీద ఉన్న మోజుతోనే తాను ఆ ఆయుధాన్ని తన వద్ద ఉంచుకున్నాననీ, తనకీ అప్పటి పేలుళ్లకీ ఏమాత్రం సంబంధం లేదనీ సంజయ్‌దత్ తరచూ చెప్పేవాడు.
సంజయ్‌దత్‌కు అప్పటి పేలుళ్లతో సంబంధం ఉన్నట్లు కోర్టులు కూడా నిర్ధారించలేకపోవడంతో, అక్రమ ఆయుధాల కేసులో అతడికి శిక్షను ఖరారు చేశారు. ఆ శిక్షను ఇదిగో ఇప్పుడు పూర్తి చేసుకుని సంజయ్ బాబు బయటకు వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను తీవ్రవాదిని కాదనీ, ఈ విషయాన్ని కోర్టులు కూడా అంగీకరించాయనీ పేర్కొన్నారు. దయచేసి మరెప్పుడూ తనని ఆనాటి విధ్వంసానికి ముడిపెడుతూ వార్తలు రాయవద్దంటూ కోరారు.