English | Telugu

‘సావిత్రి’ని దక్కించుకున్న వారాహిచలనచిత్రం

మంచి చిత్రాల‌ను ఎంక‌రేజ్ చేస్తూ వాటి విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించ‌డంలో వారాహి చ‌ల‌న చిత్రం ఎప్పుడూ ముందుంటుంది. వారాహిచ‌ల‌న చిత్రం అధినేత సాయికొర్ర‌పాటి మంచి కాన్సెప్ట్ ఉన్న చిన్న చిత్రాల‌ను చూసి వాటి హ‌క్కుల‌ను ఫ్యాన్సీ రేటుకు కైవ‌సం చేసుకుని గ్రాండ్ లెవ‌ల్ లో విడుద‌ల చేస్తున్నారు. గ‌తేడాది సూప‌ర్ హిట్ సాధించిన‘రాజుగారి గ‌ది’, ‘జ‌త కలిసే’ చిత్రాల‌ను విడుద‌ల చేసిన సాయికొర్ర‌పాటి ఇప్పుడు నారా రోహిత్ నటించిన సావిత్రి సినిమా సీడెడ్ హక్కులను ఫ్యాన్సీ రేటు చెల్లించి సినిమా సీడెడ్ హక్కులను ఫ్యాన్సీ ఆఫర్ తో చేజిక్కించుకున్నారు.

యంగ్ జనరేషన్ హీరోస్ లో మంచి పేరు తొలి చిత్రం బాణం నుండి అసుర వరకు విభిన్న కథాంశాలతో సినిమాలను చేస్తున్న హీరో. నారారోహిత్ హీరోగా, నందిత హీరోయిన్ గా రూపొందుతోన్న చిత్రం 'సావిత్రి'. ఈ చిత్రాన్ని ప్రేమ ఇష్క్ కాదల్ ఫేమ్ పవన్ సాదినేని దర్శకత్వంలో, విజన్ ఫిలింమేకర్స్ పతాకం పై డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. మార్చి 25న గ్రాండ్ లెవల్ లో విడుదలవుతుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.