English | Telugu
ట్విస్ట్ ల మీద ట్విస్ట్ ఇస్తున్న బాలయ్య
Updated : Mar 9, 2016
99వ సినిమా ‘డిక్టేటర్’ విడుదలై రెండు నెలలైనా బాలయ్య ఇంకా తన 100వ సినిమా విషయంపై క్లారిటీ ఇవ్వకుండ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ ఇస్తున్నాడు బాలయ్య. మొన్నటి వరకు తన వందో చిత్రానికి దర్శకుడు బోయపాటి అని కాదు కాదు సింగీతం శ్రీనివాస రావు అని మళ్ళి ఇటీవలే కృష్ణ వంశి అని చెప్పుకొచ్చిన బాలయ్య తాజాగా తన వందో చిత్రానికి మరో కొత్త కథ వినిపిస్తున్నాడు. పూర్వ కాలంలో అమరావతి నగరాన్ని పాలించిన గౌతమి పుత్ర శ్వేతకర్ణి అనే రాజు జీవితాన్ని బాలయ్య వందో చిత్రంగా తియనున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ మీడియా ముందు వెల్లడించాడు. ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్ర మాటలు రాస్తున్నాడని చెప్పాడు. అలాగే దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకేక్కిస్తున్నట్లు వివరించారు. క్రీ.పూ. ఒకటో శతాబ్ధానికి చెందిన, అమరావతి నేపథ్యంలో నడిచే ఈ కథ కూడా 100వ సినిమాకు ఓ ప్రత్యేకత తెచ్చిపెడుతుందన్న అభిప్రాయంలో బాలయ్య ఈ సినిమాను 100వ సినిమాగా తీస్తున్నట్లు ప్రకటించారు.