English | Telugu
పెళ్లి చేసుకున్న రంగీలా బేబీ
Updated : Mar 4, 2016
రంగీలా ఫేమ్ ఊర్మిళ ఓ ఇంటిదైంది. కాశ్మీర్ కు చెందిన మొహసిన్ అక్తర్ మిర్ అనే బిజినెస్ మ్యాన్ ను ముంబైలోని తన ఇంట్లో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఊర్మిళకు 42 ఏళ్లు. రంగీలా, భూత్, సత్య లాంటి సినిమాలతో వర్మతో కలిసి బాలీవుడ్ ను ఊపేసింది ఊర్మిళ. తెలుగులో అనగనగా ఒక రోజు సినిమాలో బాగా పేరు సంపాదించుకుంది. గతంలో మోడల్ గా చేసిన మొహసీన్ కు ఒక పెళ్లిలో ఊర్మిళలో పరిచయం అయింది. తర్వాత పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ డేటింగ్ చేశారు. కేవలం సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. కాగా, తనకు ఎంతో ఇష్టమైన హీరోయిన్ కు పెళ్లవడం పట్ల తాను సంతోషం వ్యక్తం చేస్తున్నానంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం కాశ్మీర్ లో ఎంబ్రాయిడరీ వ్యాపారం చేస్తున్న మొహసీన్ ఊర్మిళ కంటే పదేళ్లు చిన్నవాడు కావడం విశేషం.