English | Telugu

ఇవే మన హీరోల కార్లు

తారలకు సంబంధించిన ఏ విషయమైనా వారి అభిమానులకు పండగే. మన స్టార్స్ గురించి మనకు అన్ని విషయాలూ తెలుసు గానీ, వారి కార్లు గురించి మాత్రం ఎప్పుడూ సరైన క్లారిటీ ఉండదు. అందుకే మీకోసం మన టాలీవుడ్ స్టార్స్ కార్స్ కలెక్షన్ ను చూపించబోతున్నాం. మరి మీ ఫేవరెట్ స్టార్ కార్ ఏదో మీరే చూస్కోండి..

చిరంజీవి

టాలీవుడ్ లో కార్లు కొనే ట్రెండ్ ను సెట్ చేసింది చిరంజీవే. మారుతి 800 కారు నుంచి, రోల్స్ రాయస్ ఫాంటమ్ వరకూ, ఆయన ట్రై చేయని కారు లేదు. చిరుకు తన పిల్లలందరికీ ఒక్కో కారును గిఫ్ట్ గా ఇచ్చే అలవాటుంది. అందుకే ఆయన పుట్టినరోజుకు రోల్స్ రాయస్ ను గిఫ్ట్ గా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు ఆయన తనయుడు చరణ్. ఫాంటమ్ విలువ 3 కోట్లు

బాలకృష్ణ

నందమూరి నటసింహం బాలయ్యకు కూడా కార్లంటే మహా క్రేజ్. ఇప్పటికే ఆయన దగ్గర పోర్షే పనామేరా, బి.ఎమ్.డబ్ల్యూ 7 సీరీస్ కార్లున్నాయి. ఇవి కాక ఆయనకు సఫారీ, ఫార్చూనర్లంటే ఇష్టం. ఆయన లయన్ ఇమేజ్ కు తగ్గ కార్లు వాడటంలో రాజీ పడరు బాలయ్య

పవన్ కళ్యాణ్

అసలే పవర్ స్టార్. అందునా అత్యంత క్రేజీయస్ట్ హీరో. మరి ఆయన ఏ కారు వాడతారో తెలుసా..రెండు బెంజ్ లు, ఒక స్కోడా..వీటి విలువ రెండు కోట్ల వరకూ ఉంటుంది. ప్రస్తుతం 87 లక్షల ఆడి క్యూ 7 వాడుతున్నారు పవన్.

మహేష్ బాబు

మహేష్ ఫేవరెట్ కార్ ను ఆయన భార్య నమ్రత గిఫ్ట్ గా ఇచ్చింది. ఇండియాలో వచ్చిన మొట్టమొదటి రేంజ్ రోవర్ ను మహేష్ 36 పుట్టిన రోజున కానుకగా ఇచ్చింది. ఇది మహేష్ కు చాలా ఇష్టమైన కార్. దీని విలువ రెండు కోట్ల వరకూ ఉంటుంది

ఎన్టీఆర్

యంగ్ టైగర్ అన్న పేరుకు తగ్గట్టు, ఎన్టీఆర్ కార్లన్నీ సూపర్ కెపాసిటీ ఉన్నవే. ఇప్పటికే ఆయనకు చాలా స్పోర్ట్స్ బైకులు, ప్రీమియం కార్లు ఉన్నాయి. లేటెస్ట్ గా ఆయన కలెక్షన్లోకి పోర్షె కారు వచ్చి చేరింది. దీని విలువ రెండున్నర కోట్లు.

రామ్ చరణ్

తండ్రికి తగ్గ తనయుడిగా సినిమాల్లో ప్రూవ్ చేసుకున్న రామ్ చరణ్, కార్ల విషయంలో కూడా మెగాస్టార్ కు గట్టి పోటేయే. తన పెళ్లికి ఆస్టోన్ మార్టిన్ కారు గిఫ్ట్ గా వచ్చి చరణ్ కలెక్షన్లో చేరింది. ఆ తర్వాత రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఇండియా ఎడిషన్లోని మొట్టమొదటి కారును కూడా చరణే కొన్నాడు. మగధీరుడి దగ్గరున్న మొత్తం కార్ల విలువ దగ్గరగా ఆరు కోట్లు.

రవితేజ

మాస్ మహారాజ్ రవితేజ కార్ల దగ్గర రాజీ పడడు. చిన్న చిన్న పాత్రలు వేసే స్థాయి నుంచి, స్టార్ గా ఎదిగిన రవితేజ కు కార్ల వాల్యూ బాగా తెలుసు. ఇప్పుడు ఆయన వాడేది మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్. దీని విలువ ఒకటిన్నర కోట్లు.

అల్లు అర్జున్

బన్నీ ఎక్కువగా కార్లపై దృష్టి పెట్టడు. కానీ తన దగ్గరున్నవన్నీ కూడా చాలా విలువైనవే. ప్రస్తుతం BMWx6 ను వాడుతున్నాడు. ఇది స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్. దీని విలువ కోటి రూపాయల వరకూ ఉంటుంది. ఇంతకూ బన్నీ నెంబర్ ప్లేట్ తెలుసా..666

నాగచైతన్య

ఈ అక్కినేని వారసుడికి కార్లంటే మహా మోజు. ఇప్పటికే అనేక కార్ల కలెక్షన్ ఉన్న చైతూ వాడేది బి.ఎమ్.డబ్ల్యూ 325. దీని విలువ 60 లక్షలు పైమాటే.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .