English | Telugu

బిగ్ ట్విస్ట్.. సూపర్ స్టార్ సినిమా నుండి తప్పుకున్న డైరెక్టర్!

సూపర్ స్టార్ తో సినిమా చేయడానికి దర్శకులందరూ ఆసక్తి చూపుతారు. అలాంటిది అధికారికంగా ప్రకటించిన ఒక భారీ ప్రాజెక్ట్ నుండి డైరెక్టర్ తప్పుకునే సాహసం చేస్తాడా?. తాజాగా ఓ దర్శకుడు అదే పని చేసి షాకిచ్చాడు.

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నిర్మాణంలో ఒక సినిమా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. రజినీకాంత్ కెరీర్ లో 173వ సినిమాగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ కి దర్శకుడిగా సుందర్ సి పేరుని కూడా ప్రకటించారు.

Also Read: ఇది నిజంగా రాజమౌళి సినిమాయేనా..?

'తలైవా 173'(Thalaivar173) వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు తాజాగా దర్శకుడు సుందర్ ప్రకటించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి హృదయానికి కష్టంగా ఉన్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని సుందర్ తెలిపారు.

ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండి, 'తలైవా 173'కి తగిన సమయాన్ని కేటాయించలేకనే సుందర్ తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. కొందరేమో స్క్రిప్ట్ విషయంలో రజినీకాంత్ సంతృప్తిగా లేరని, అందుకే సుందర్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

ఇదిలా ఉంటే, 'తలైవా 173' నుండి సుందర్ సి తప్పుకోవడంతో.. ఆయన స్థానంలో దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ ని తీసుకోవాలని సూపర్ స్టార్ అభిమానులు కోరుతున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.