English | Telugu

ఉదయ్ శంకర్, మేఘా ఆకాశ్ జంటగా సినిమా మొదలైంది

ప్రతిభావంతమైన నటుడిగా పేరు తెచ్చుకున్న ఉదయ్ శంకర్ హీరోగా కొత్త సినిమా ఫిలింనగర్‌లోని దైవసన్నిధానంలో సోమవారం ప్రారంభం అయింది. మన్మోహన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీరామ్ మూవీస్ బ్యానర్ పై డాక్టర్ సౌజన్య ఆర్. అట్లూరి సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. డాక్టర్ సౌజన్య ఆర్. అట్లూరి సమర్పిస్తున్నారు.

ఈ సందర్భంగా నటుడు మధునందన్ మాట్లాడుతూ.. "నారాయణరావుగారు నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తోన్న మన్మోహన్ నా సొంత బ్రదర్. ఉదయ్ కి ఈ మూవీ సూపర్ హిట్ ఇస్తుందని చెప్పగలను. ఎందుకంటే ఈ స్క్రిప్ట్ మొత్తం నేను చదివాను. అందుకే ఉదయ్ కి మంచి హిట్ ఇవ్వడంతో పాటు అతన్ని నెక్ట్స్ లీగ్ లోకి తీసుకువెళుతుందని అనుకుంటున్నాను." అన్నారు.

హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ.. "హీరోగా నాకు ఇది ఐదో సినిమా. ఈ బ్యానర్ లో రెండో సినిమా. నచ్చింది గర్ల్ ఫ్రెండ్ సినిమా తర్వాత మధునందన్ తో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ మూవీలో అతనికి చాలా ఇంపార్టెంట్ రోల్. హిలేరియస్ గా సాగే ఎగ్జైటింగ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. మన్మోహన్ అద్భుతమైన స్క్రిప్ట్ తో వచ్చాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉంటుంది. అతి త్వరలోనే రెగ్యులర్ షూట్ కు వెళ్లబోతున్నాం." అని తెలిపారు.

దర్శకుడు మన్మోహన్ మాట్లాడుతూ.. "దర్శకుడిగా ఇది నాకు ఫస్ట్ మూవీ. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత నారాయణరావుగారికి, హీరో ఉదయ్ కి థ్యాంక్యూ. ఏప్రిల్ మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగబోతోంది. ఇది ఫ్యామిలీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు ఒక చిన్న ప్రేమకథ కూడా మిక్స్ అయి ఉంటుంది. మీ అందరికీ ఈ కథ నచ్చుతుందని ఆశిస్తున్నాను." అని చెప్పారు.

నిర్మాత నారాయణరావు మాట్లాడుతూ... "శ్రీరామ్ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ టూ కూడా ఉదయ్ తోనే మొదలుపెడుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ మూవీ కథ చాలా బావుటుంది. స్క్రిప్ట్ అసాధారణంగా ఉంది. ఉదయ్ శంకర్ తో పాటు హీరోయిన్ మేఘా ఆకాశ్ పాత్రలు చాలా బావుంటాయి. మ్యూజిక్ శ్రీ చరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ జాంబిరెడ్డి ఫేమ్ అనిత్ కుమార్ అందిస్తున్నారు." అన్నారు.

ఉదయ్ శంకర్, మేఘా ఆకాశ్, మధునందన్, వెంకటేష్ కాకమాను, శశి ప్రధాన తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ: అనిత్ కుమార్, ఆర్ట్ డైరెక్టర్: షర్మేల యెలిశెట్టి, కాస్ట్యూమ్ డిజైనర్: జోస్యుల గాయత్రిదేవి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సాయికృష్ణ, వెంకీ, కిశోర్, నిర్మాత: అట్లూరి నారాయణరావు, రచన, దర్శకత్వం: మన్మోహన్ మేనంపల్లి.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.