English | Telugu

సంక్రాంతికి అసలుసిసలైన బాక్సాఫీస్ వార్!

ఈ ఏడాది సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో చిరంజీవి, 'వీరసింహారెడ్డి'తో బాలకృష్ణ బాక్సాఫీస్ బరిలోకి దిగారు. వచ్చే ఏడాది సంక్రాంతి పోరు మరింత రసవత్తరంగా మారనుంది. 2024 సంక్రాంతికి ఏకంగా నలుగురు స్టార్ హీరోలు బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో ఇప్పటికే ఇద్దరు స్టార్ల సినిమాల విడుదల తేదీ ఖరారు కాగా, మరో రెండు సినిమాల తేదీలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ప్రాజెక్ట్ k'. వైజయంతి మూవీస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని 2024, జనవరి 12న విడుదల చేయబోతున్నట్లు కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. భారీ సినిమా కాబట్టి చెప్పిన తేదీకి రావడం అనుమానమనే అభిప్రాయాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఈ సినిమా ప్రస్తుతానికి సంక్రాంతి రేసులో ఉన్నట్లే.

'అతడు', 'ఖలేజా' తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మూడో సినిమా 'ఎస్ఎస్ఎంబి 28'(వర్కింగ్ టైటిల్). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2024, జనవరి 13న విడుదల చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. అంటే ఇప్పటిదాకా సంక్రాంతి రేసులో రెండు చిత్రాలు అధికారికంగా ఉన్నాయి. వీటితో పాటు మరో రెండు చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'గేమ్ చేంజర్'. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏవైనా కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమైతే తప్ప ఎక్కువ శాతం సంక్రాంతికే విడుదలయ్యే అవకాశాలున్నాయి. లేదంటే వేసవికి రావొచ్చు.

పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతికే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలు కానున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావడం ఖాయమనే చెప్పొచ్చు. మొత్తానికి 2024 సంక్రాంతికి కనీసం ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యే అవకాశముంది.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.