English | Telugu

త్రివిక్ర‌మ్ మాత్రం ఫుల్ హ్యాపీ!

స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి కి మిక్స్‌డ్ రిజ‌ల్ట్ వ‌చ్చింది. త్రివిక్ర‌మ్ స్టైల్ లోపించింద‌ని, ఈసినిమాలో విష‌యం ఏం లేద‌ని... మెగా ఫ్యాన్స్ కూడా పెద‌వి విరిచారు. ఓపెనింగ్స్‌లో దుమ్ము రేగ్గొట్టిన ఈ సినిమా ఆ త‌ర‌వాత బాగా డ‌ల్ అయ్యింది. ఎంత చేసినా ఈ నాలుగురోజులే. ఆ త‌ర‌వాత కొత్త సినిమాలు వ‌చ్చేస్తాయి.. స‌త్య‌మూర్తి సైడ్ అయిపోతుంది. మొత్త‌ంమ్మీద ఈ సినిమా రూ.50 కోట్ల మార్క్ దాట‌డం క‌ష్ట‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు తేల్చేస్తున్నాయి. అదే జ‌రిగితే బ‌య్య‌ర్లు భారీగా న‌ష్ట‌పోతారు. కానీ త్రివిక్ర‌మ్ మాత్రం ఈ రిజ‌ల్ట్‌తో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. బ‌న్నీ లాంటి ఎన‌ర్జిటిక్‌స్టార్‌తో సెంటిమెంట్ న‌డిపించి.. ఈ మాత్రం వ‌సూళ్ల‌యినా ద‌క్కినందుకు హ్యాపీగా ఉన్నాడ‌ట‌. ఈ సినిమా 50 - 50 అని ముందే అనుకొన్నాడ‌ట‌. అయితే తాను అనుకొన్న‌దానికంటే మంచి రిజ‌ల్ట్ వ‌చ్చింద‌ని ఫీల‌వుతున్నాడ‌ట‌. అంతేకాదు.. పారితోషికం ప‌రంగానూ త్రివిక్ర‌మ్‌కి బాగానే పనైంది. దాదాపుగా రూ.15 కోట్ల వర‌కూ ముట్టాయ‌ట‌. దాంతో... అన్నివైపులా ఖుషీ ఖుషీగా ఉన్నాడీ మాట‌ల మాంత్రికుడు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.