English | Telugu
వామ్మో..ఆ అమ్మడు అన్నీ చూపించేస్తోంది...!
Updated : Apr 21, 2016
వయసు మళ్లే కొద్దీ త్రిషకు నటనలో మరింత అనుభవం రావడం వల్లో లేక ఎలాగూ కెరీర్ కు ఆఖరి మెట్టు మీద ఉన్నాం కాబట్టి, మనలోని నటనా పటిమ చూపిద్దాం అనుకుందో ఏమో కానీ, నాయకి కోసం తనలోని నట విశ్వరూపాన్ని బయటపెట్టింది త్రిష. ఇప్పటికే సినిమా ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా, రీసెంట్ గా మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు మూవీ టీం. నవరసాల్ని ఎలా పలికించగలనో త్రిష పోస్టర్లో చూపించేస్తోంది. ఈ పోస్టర్ చూసిన తర్వాత త్రిషలో ఇంత యాక్టింగ్ ఉందా అనుకుంటున్నారు జనాలు. సత్యం రాజేష్, గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. గోవి డైరెక్ట్ చేసిన నాయకి తమిళ తెలుగు భాషల్లో రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం త్రిష ఆశలన్నీ నాయకి మీదే ఉన్నాయి. ఈ సినిమా బ్రేక్ ఇస్తే, నయనతారలా తను కూడా మళ్లీ ఫామ్ లోకి వచ్చేయచ్చు అని ఆశపడుతోంది. మరి త్రిషమ్మ ఆశల్ని నాయకి ఎంతవరకూ తీరుస్తుందో చూడాలి.