English | Telugu
షారుఖ్ సినిమాపై మెంటల్ టార్చర్ కేసు..!
Updated : Apr 21, 2016
ఇండియాలో ఎవరు ఎవరిమీదైనా కేసు పెట్టేసుకోవచ్చు. అందులోనూ ఒక్కోసారి విచిత్రమైన కేసులు కూడా ట్రై చేయచ్చు. వీటి వలన పబ్లిసిటీయే కాక, కేసు గెలిస్తే డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. రీసెంట్ గా రిలీజైన షారుఖ్ ఫ్యాన్ సినిమాపై ఇలాంటి కేసు ఒకటి నమోదైంది. ముంబైకి చెందిన సంగీత అనే ఆమె షారుఖ్ , పివిఆర్ సినిమాస్, యశ్ రాజ్ ఫిలిమ్స్ పై ముంబై కోర్టులో కేసు వేసింది. ఫ్యాన్ సినిమాలో జబ్రా సాంగ్ కోసం తాను, తన కుటుంబ సభ్యులతో కలిసి ఫ్యాన్ సినిమాకు వెళ్లానని, టిక్కెట్ కు 650 రూపాయలు చెల్లించానని, కానీ సినిమాలో ఆ పాట లేకపోవడం తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆమె ఆరోపిస్తున్నారు. తమను మానసికంగా వ్యథకు గురి చేసినందుకు పరిహారంగా టిక్కెట్ డబ్బులు 2,600 వెనక్కివ్వడంతో పాటు, యాభైవేల రూపాయలు పరిహారం చెల్లించాలని కోర్టును కోరుతున్నారు. ఈ కేసు రేపు విచారణకు రానుంది. కాగా, ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి 52.35 కోట్లతో షారుఖ్ ఫ్యాన్ 2016 బాలీవుడ్ సినిమాల్లో రికార్డ్ సృష్టించాడు. ఇప్పటి వరకూ మొదటి ప్లేస్ లో ఉన్న అక్షయ్ కుమార్ ఎయిర్ లిఫ్ట్ సెకండ్ ప్లేస్ కు పడిపోయింది. సినిమాకు డివైడ్ టాక్ వస్తున్నా, ఫ్యాన్ కు కలెక్షన్లు మళ్లీ స్టడీ అవడం విశేషం.