English | Telugu
ట్రైలర్ రివ్యూ : భయపెడుతున్న త్రిష నాయకి..!
Updated : Apr 20, 2016
కెరీర్ చివర్లో ఉన్న త్రిష, నాయకి తో మళ్లీ కెరీర్ ను నిర్మించుకోవాలనుకుంటోంది. ఇప్పటికే అవకాశాలు డ్రై అయిపోయిన ఈ చెన్నై చిన్నది, ఇక నుంచైనా మళ్లీ కెరీర్ ట్రాక్ లో పడుతుందని ఆశిస్తోంది. గోవి దర్శకత్వంలో, గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై గిరిధర్ నిర్మిస్తున్నారు. తెలుగులో నాయకిగా, తమిళంలో నాయగిగా త్రిష భయపెట్టడానికి రెడీ అవుతోంది. నిన్న జరిగిన ఆడియో రిలీజ్ ఫంక్షన్లో, సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మూవీ టీం. అందంతో పాటు, భయాన్ని కూడా కలిగిస్తూ, రెండు షేడ్స్ ఉన్న పాత్రలో త్రిష నటించింది. ప్రతీ ఊరికి ఒక రహస్యం ఉంటుంది. ప్రతీ ఇంటికీ ఒక కథ ఉంటుంది అనే లైన్స్ తో ట్రైలర్ మొదలవుతుంది. తన ఫ్యామిలీతో సహా ఆ ఇంటిలో దిగిన సత్యం రాజేష్ ను దెయ్యం ఇబ్బంది పెడుతుందని ట్రైలర్ బట్టి అర్ధం చేసుకోవచ్చు. మధ్య మధ్యలో బ్రహ్మీ ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్, దెయ్యంగా త్రిష డైలాగ్, కట్ షాట్స్ లో సినిమాలోని క్యారెక్టర్స్ అన్నింటినీ పరిచయం చేస్తూ ట్రైలర్ ను కట్ చేశారు. ఓవరాల్ గా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. త్రిష కెరీర్లోనే మంచి గుర్తింపు తెచ్చే సినిమా అవుతుందంటూ మూవీ టీం చెబుతున్నారు. రఘు కుంచే అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటోంది. సత్యం రాజేష్, గణేష్ వెంట్రామన్, సుష్మ రాజ్, కోవై సరళ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.