English | Telugu
భారీగానే ప్లాన్ చేస్తున్న బన్నీ సరైనోడు..!
Updated : Apr 20, 2016
బోయపాటి డైరెక్షన్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడుగా వస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ కెరీర్లోనే భారీ అంచనాల మధ్య, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ, భారీ రిలీజ్ కు పూనుకుంటోంది. మళయాళంతో కలుపుకుని, ప్రపంచవ్యాప్తంగా 2 వేల థియేటర్లలో సరైనోడు రిలీజవుతున్నాడని అంచనా వేస్తున్నారు. క్లాస్ కు తప్ప మాస్ సినిమాలకు స్థానం ఇవ్వని ఓవర్సీస్ లో కూడా 160 కు పైగా లొకేషన్స్ లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారట. బన్నీకి ఉన్న స్టైలిష్ స్టార్ ఇమేజ్, యుఎస్ మార్కెట్ లో జనాన్ని రప్పిస్తుందని అల్లు అరవింద్ భావిస్తున్నారు. ఆల్ మోస్ట్ అన్ని సెంటర్లలోనూ ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. సర్దార్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, సినిమా టాక్ బయటికి వచ్చే లోపే, భారీగా కలెక్షన్లు కుమ్ముకోవచ్చనేది ప్రీమియర్ షోల వెనుక ఆలోచన. యుఎస్ లో ప్రీమియర్ షో టిక్కెట్ ధర 25 డాలర్ల వరకూ ఉందని సమాచారం. సినిమాకు కాస్త టాక్ అటూ ఇటూ అయినా, ఈ ప్రీమియర్ షోల పుణ్యమా అని కలెక్షన్ పరంగా ఫస్ట్ డే సేవ్ అవుతారు. ఒక వేళ పాజిటివ్ టాక్ వస్తే, ఇవే షోలు యాడెడ్ ప్లస్ గా మారతాయి. అల్లు అర్జున్ కెరీర్లోనే రికార్డ్ స్థాయిలో ప్రీమియర్ షోలు సరైనోడుకి పడటం విశేషం.