English | Telugu
త్రిష ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ అయ్యింది
Updated : Jan 7, 2015
గత కొద్ది రోజులుగా హీరోయిన్ త్రిష ఎంగేజ్‌మెంట్ జరిగిపోయిందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆ వార్తలను త్రిష ఖండించింది.కానీ మరో శుభవార్త తెలియజేసింది. తన ఈనెల 23న జరగనున్నట్లు త్రిష స్వయంగా ట్విట్టర్లో తెలియజేసింది. సినీ నిర్మాత వరుణ్ మణియన్‌తో త్రిషకు నిశ్చితార్థం జరగనుంది. అయితే గతంలో ఎన్నోసార్లు త్రిష పెళ్ళి చేసుకోబోతోందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈసారి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. సినీ నిర్మాత వరుణ్ మణియన్‌తో త్రిష పెళ్ళి కాబోతోందని వార్తలు కూడా గతంలో వచ్చాయి. వీరిద్దరూ కలసి వున్న ఫొటోలు కూడా నెట్‌లో హల్ చల్ చేశాయి. అయితే ఈ సారి త్రిష స్వయంగా తెలియజేయడంతో మీడియా మొత్తం లో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. మొత్తమ్మీద త్రిష ఎంగేజ్‌మెంట్ ఖరారైంది.