English | Telugu

సిద్దార్థ్ తో సమంత బ్రేకప్

గత మూడేళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న సిద్ధార్థ్‌, సమంత కటీఫ్‌ చెప్పేసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారని అందరూ అనుకుంటున్న టైంలో, ఈ ప్రేమజంట విడిపోయిందనే వార్త అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. తమ ప్రేమ వ్యవహారం గురించి ఎక్కడా బయటకి మాట్లాడని వీరిద్దరూ ఇప్పుడు బ్రేక్‌లప్‌ గురించి మాట్లాడతారని అనుకోలేం.సిద్ధార్థ్‌కి బ్రేకప్స్‌ కొత్త కాదు. మొదటి భార్యతో విడాకులు తీసుకున్నసిద్ధార్థ్, ఆ తరువాత సోహా అలీ ఖాన్‌, శృతిహాసన్‌తో ప్రేమ వ్యవహారం నడిపి బ్రేకప్స్‌ చేసుకున్నాడు. అయితే ఈ బ్రేకప్‌ వ్యవహారం సమంతని చాలా బాధించిందని వినిపిస్తోంది.