English | Telugu
నా మావయ్యకి సాటిలేరంటున్న మేనల్లుడు..!
Updated : Apr 15, 2016
మనం..సోగ్గాడే చిన్నినాయనా..ఊపిరి తదితర సినిమాలతో హిట్‌లు కొట్టిన కింగ్ నాగార్జునను ప్రేక్షకుల నుంచి ప్రముఖుల వరకు అందరూ ఆకాశంలోకి ఎత్తెస్తున్నారు. ఈ జాబితాలోకి నాగ్ మేనల్లుడు సుశాంత్ చేరాడు. తాజాగా ఊపిరి విజయోత్సవ వేడుకలో సుశాంత్ మావయ్య నాగార్జునను పొగడ్తలతో తడిపి ముద్ద చేశాడు.
అలనాటి గీతాంజలి నుంచి ఊపిరి వరకు నాగ్ టచ్ చేయని జోనర్ లేదని..ఏ సినిమా తీసుకున్నా దానికి తగ్గట్టు ప్రత్యేకంగా ఉండేలా ఉండడం తన మావయ్యకే సాధ్యమైందని, మావయ్య లాంటి వర్సటైల్ యాక్టర్ మరొకరు లేరని ఇలాంటి నటుడు దొరకడం ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమన్నారు. తన లాంటి యువనటులకు కింగ్ ఎప్పుడూ స్పూర్తిగా ఉంటాడని, తాతగారి పేరును నిలబెడుతూ, తనదైన స్టైల్లో దూసుకుపోతున్నారని కొనియాడారు. ఊపిరి లాంటి సినిమాలో నటించాలంటే ఒక సూపర్ స్టార్ ఆలోచిస్తాడని కానీ మావయ్య మాత్రం అలాంటి ఆలోచన పెట్టుకోకుండా పాత్రలో ఒదిగిపోయారని మన్మథుడిపై ప్రశంసల జల్లు కురిపించారు సుశాంత్.