English | Telugu

షారుఖ్ ఖాన్ ' ఫ్యాన్ ' : మూవీ రివ్యూ

షారుఖ్ ఖాన్ చాలా కాలం తర్వాత, తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికొచ్చి నటించిన సినిమా ఫ్యాన్. నటించడం మొదలెట్టిన కొత్తలో నెగటివ్ రోల్స్ లో కూడా అద్భుతంగా మెప్పించేవాడు షారుఖ్. దిల్ వాలే దునియా లేజాయేంగే తర్వాతి నుంచి కింగ్ ఆఫ్ రొమాన్స్ అనే పేరు షారుఖ్ కు వచ్చేసింది. ఆ తర్వాత తనకు సౌకర్యంగా ఉన్న పాత్రలే చేసుకుంటూ వచ్చాడు కింగ్ ఖాన్. చాలా కాలం తర్వాత నెగటివ్ షేడ్స్ లో అద్భుతంగా నటనను పండించాడు షారుఖ్. చాలాకాలం తర్వాత షారుఖ్ నుంచి వచ్చిన విభిన్నమైన సినిమాగా ఫ్యాన్ గురించి చెప్పుకోవాలి. ఇంతకూ ఫ్యాన్ బాగుందా లేదా..లెట్స్ జూమ్..

కథ :

ఆర్యన్ ఖన్నా(షారుఖ్ ఖాన్)కు కనీసం ట్రైన్ టిక్కెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. ముంబైకు వచ్చిన కొత్తలో చాలా కష్టమైన జీవితాన్ని గడిపిన ఆర్యన్ ఖన్నాకు ఎలాగైనా సక్సెస్ అవ్వాలనే ఆకలి చాలా ఎక్కువ. ఆ కసితోనే కష్టపడి, బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఎదుగుతాడు. తన పేరే ఒక బ్రాండ్ గా ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. ఇలా ఆర్యన్ సూపర్ స్టార్ స్టేటస్ కు వచ్చేసిన చాలా కాలం తర్వాత..అతని కున్న కోట్లాది మంది అభిమానుల్లో ఒకరు గౌరవ్ చనానా(షారుఖ్ ఖాన్). ఢిల్లీలో ఉండే ఈ కుర్రాడికి ఆర్యన్ అంటే పిచ్చి. ఆర్యన్ ను ఇమిటేట్ చేసి, సూపర్ సితార అనే షోలో ట్రోఫీ గెలుస్తాడు. ఆ ట్రోఫీని ఆర్యన్ కు చూపించాలనుకుంటాడు. ముంబై వెళ్లి ఎలాగోలా ఆర్యన్ ఇంటికి చేరుకుంటాడు. కానీ అక్కడ ఉన్న వందలాది మంది ఫ్యాన్స్ లో గౌరవ్ ఆర్యన్ కు కనీసం కనబడడు. తర్వాత ఎలాగోలా ప్లాన్ చేసి ఆర్యన్ ను కలవగలుగుతాడు కానీ, ఆర్యన్ ఖన్నా తాను అనుకున్న దానికి చాలా భిన్నంగా ఉండటం చూసి షాక్ అవుతాడు. సినిమాల్లో ఆర్యన్ ఖన్నా చేసే పాత్రలాగే బయటకూడా ఉంటాడనుకుంటాడు గౌరవ్. కానీ ఆర్యన్ ను కలిసిన తర్వాత అతను తన సక్సెస్ తనది మాత్రమే అని నమ్మే స్వార్ధపరుడని గౌరవ్ కు అర్ధమవుతుంది. ఇక్కడినుంచే అసలు కథ మొదలవుతుంది. స్వాభావికంగా విచిత్రమైన స్వభావం కలవాడు గౌరవ్. ఆర్యన్ మీద ఇష్టం పెరిగి పిచ్చిగా మారిన తర్వాత, ఆర్యన్ ను ఎలాంటి ఇబ్బందులు పెట్టాడు, చివరికి ఏమైంది అన్నదే మిగిలిన కథ..

పెర్ఫామెన్స్ :

ముందే చెప్పుకున్నట్టు చాలా కాలం తర్వాత షారుఖ్ తన క్యాలిబర్ కు తగ్గ స్టోరీని ఎంచుకున్నాడు. రెండు పాత్రల్లో వేరియేషన్ చూపించడంలో షారుఖ్ వంద శాతం సక్సెస్ అయ్యాడు. అంతేకాక యాభై ఏళ్లు పైబడిన షారుఖ్, పాతికేళ్ల కుర్రాడి ఎనర్జీతో కనిపించడం మాటలు కాదు. ఈ విషయంలో కూడా షారుఖ్ కు వంద మార్కులు పడతాయి. సినిమా గురించి, పెర్ఫామెన్స్ గురించి చెప్పాలంటే ఒకటే లైన్. ఇది షారుఖ్ వెర్సస్ షారుఖ్.

టెక్నికల్ గా :

ఫ్యాన్ లో మొదట చెప్పుకోవాల్సింది డైలాగ్ రైటర్ శరత్ కటారియా గురించి. సినిమా టెంపో ఎక్కడా డౌన్ అవకుండా తన డైలాగ్స్ తో ప్రతీ సీన్ కు అట్రాక్షన్ తీసుకొచ్చాడు. ముంబైలో ఉండే స్టార్ హీరో హిందీకి, ఢిల్లీ గల్లీల్లో తిరిగే సామాన్య కుర్రాడి హిందీ స్లాంగ్ కు చాలా తేడా ఉంటుంది. ఈ తేడాను శరత్ పెర్ఫక్ట్ గా తన డైలాగుల్లో చూపించాడు. సినిమాకు సాంగ్స్ లేకపోవడం పెద్ద ప్లస్. మధ్యమధ్యలో సాంగ్స్ వచ్చి టెంపోను డౌన్ చేసే ప్రమాదం ఎక్కడా లేదు. 143 నిముషాల నిడివితో, ఎడిటింగ్ చాలా క్రిస్ప్ గా, షార్ప్ గా సాగిపోయింది. మనీష్ శర్మకు డైరెక్టర్ గా మంచి విజయం దక్కింది. ఈ కాన్సెప్ట్ ను కథగా ఎంచుకున్నప్పుడే మనీష్ సగం సక్సెస్ ను కొట్టేశాడు.

తెలుగవన్ వ్యూ :

షారుఖ్ వీరాభిమానులు పండగ చేసుకునే సినిమా ఫ్యాన్. ఫ్యాన్స్ కాని వాళ్లు సౌకర్యంగా మంచి సినిమా చూశామనుకుంటూ హాళ్ల బయటకు వచ్చేయచ్చు. సినిమాలో అక్కడక్కడా లాజిక్ లు కాస్త గాడి తప్పినా, ఈ టైప్ సినిమాకు ప్రాణమైన థ్రిల్లింగ్ ఎలిమెంట్ ను మిస్ కాకుండా చూసుకున్నాడు దర్శకుడు. 90ల్లో షారుఖ్ నటనను మళ్లీ చూపిస్తుందీ సినిమా. చాలా కాలం తర్వాత షారుఖ్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇచ్చాడు. ఓవరాల్ గా చాలా కాలం తర్వాత షారుఖ్ ఖాతాలో ఒక హిట్టు పడినట్టే.

రేటింగ్ : 2.75/5

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.