English | Telugu
కాజల్ కు సౌత్ వాళ్లే ఇష్టమట..!
Updated : Apr 15, 2016
అందాల చందమామ కాజల్ గత పదేళ్లుగా తెలుగు ఇండస్ట్రీని ఏలుతోంది. బ్రేక్ వచ్చింది మగథీరతోనే ఐనా, అంతకు ముందు చందమామ సినిమాతో అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకుంది. తమిళం, హిందీ భాషల్లో చేసినా, తన ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఎప్పుడూ తెలుగుకేనంటోందీ భామ. ప్రస్తుతం ఈవిడగారు నటించిన దో లజోన్ కీ కహానీ సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. ప్రపంచాన్ని చూడలేని ఒక అమ్మాయి ప్రేమలో పడితే అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా మేలో రిలీజవ్వబోతోంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలో బాలీవుడ్ కు మీ ఓటా, లేక సౌత్ మూవీస్ కా అన్న ప్రశ్న ఎదురైనప్పుడు అలా స్పందించిందీ భామ. తనకు లైఫ్ ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీ అని, అందుకే ఎప్పుడూ తన ప్రిఫరెన్స్ తెలుగుకే ఉంటుందని చెప్పుకొచ్చింది. అంతేకాదండోయ్. మన సినిమాలు రిచ్ గా, నీట్ గా ఉంటాయని, హీరోయిన్స్ ను ఇక్కడ బాగా చూసుకుంటారని చెబుతోంది. గతంలో ఇలియానా కూడా సేమ్ టు సేమ్ ఇదే రికార్డేసింది. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. మరి కాజల్ అయినా మాట మీద నిలబడి ఉంటుందో లేదో చూద్దాం.