English | Telugu
‘యానిమల్’ ఫస్ట్ డే కలెక్షన్స్!
Updated : Dec 2, 2023
అంతా అనుకున్నట్టే జరిగింది. భారతీయ సినీ ప్రేక్షకులు యానిమల్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యి తొలి రోజే రికార్డు కలెక్షన్స్ ని సాధిస్తుందని నమ్మారో అదే జరిగింది. యానిమల్ మూవీ ఫస్ట్ డే రికార్డు స్థాయి కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. నిన్న కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎక్కడ చూసినా ఒకటే మాట యానిమల్ మూవీ సూపర్ గా ఉందని. దాంతో ప్రేక్షకులు యానిమల్ ఆడే థియేటర్స్ ముందు క్యూ కట్టారు. అడ్వాన్సు బుకింగ్స్ లోను రికార్డు లు సృష్టించిన యానిమల్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
వరల్డ్ వైడ్ గా చూసుకుంటే యానిమల్ తొలి రోజు 116 కోట్ల గ్రాస్ కి పైగా వసులు చేసింది .ఒక్క ఇండియాలోనే 70 కోట్లు ని కొల్లగొట్టింది. నార్త్ స్టేట్స్ లో 50 కోట్లు, తెలుగులో 10 కోట్లు ,తమినాడు కర్ణాటక ,కేరళ కలుపుకొని ఇంకో 10 కోట్లు ఇలా మొత్తం 70 కోట్లని ఇండియాలో రాబట్టింది. సుమారు 200 కోట్ల బడ్జట్ తో రూపొందిన యానిమల్ తొలి రోజే అంతటి భారీ కలెక్షన్లు సాధించడం చూస్తుంటే సినిమాకి వస్తున్న హిట్ టాక్ వల్ల ఇంకా భారీగా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. పైగా ఇంకో వారం దాకా ఎలాంటి కొత్త సినిమాలు లేకపోవడం యానిమల్ కి ప్లస్ పాయింట్
రణబీర్ సినిమా కెరీర్ లోనే తొలి రోజు హైయస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాగా యానిమల్ నిలవడమే కాకుండా 2023 లో బాలీవుడ్ లో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో టాప్ 3 ప్లేస్ లో యానిమల్ నిలిచింది. మొదటి రెండు ప్లేసుల్లో షారుక్ నటించిన పఠాన్ ,జవాన్ మూవీలు ఉన్నాయి.