English | Telugu

ఆ రెండు రోజులు టాలీవుడ్ కు సెలవు

రాష్ట్రంలో ఎన్నికల కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ విశ్రాంతిని ప్రకటించింది. సినీ పరిశ్రమకు చెందినవాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఈనెల 30న టాలీవుడ్ మొత్తం షూటింగ్ లు నిర్వహించకూడదంటు ఎపి ఫిలింఛాంబర్ నిబంధన విధించింది. ఆ రోజు సాయంత్రం 6గంటల తర్వాత షూటింగ్ లు జరుపుకోవడానికి అనుమతించింది. షూటింగ్ లతో పాటుగా థియేటర్లు కూడా సాయంత్రం 6 గంటల వరకు మోసేయల్సిందిగా ఎపి ఫిలింఛాంబర్ నిర్ణయించింది. ఈ నిబంధన మే7న సీమంధ్రలో జరిగే ఎన్నికలకు కూడా వర్తిస్తుందని తెలిపింది. అంటే రెండు రోజుల పాటు షూటింగ్ మరియు థియేటర్లు బంద్ అన్నమాట.