English | Telugu

వారసుడు కోసం ఊహించని కాంబో సెట్‌ చేస్తున్న దిల్‌రాజు!

వారసుడు కోసం ఊహించని కాంబో సెట్‌ చేస్తున్న దిల్‌రాజు!

‘మేం వయసుకు వచ్చాం’ చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన త్రినాథరావు నక్కిన తన ప్రతి సినిమాలోనూ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానంగా ఉండేలా చూసుకుంటారు. ఇటీవల విడుదలైన మజాకా కూడా ప్రేక్షకుల్ని బాగా ఎంటర్‌టైన్‌ చేస్తోంది. తాజాగా మరో కొత్త సినిమాకి శ్రీకారం చుడుతున్నారు. గతంలో నాని హీరోగా త్రినాథరావు దర్శకత్వంలో నేను లోకల్‌ చిత్రాన్ని నిర్మించారు దిల్‌రాజు. ఇప్పుడు మరోసారి అతని డైరెక్షన్‌లో సినిమా చేయబోతున్నారు. అయితే ఈ సినిమాకి హరీష్‌ శంకర్‌ కథను అందించడం విశేషం.  ఇటీవలికాలంలో త్రినాథరావు దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాలకూ ప్రసన్నకుమార్‌ బెజవాడ రచయితగా వ్యవహరిస్తున్నారు. దాన్ని బ్రేక్‌ చేస్తూ ఇప్పుడు హరీష్‌ శంకర్‌ని సెలెక్ట్‌ చేసుకున్నారు త్రినాథరావు. 

దిల్‌రాజు సోదరుడి కుమారుడు ఆశిష్‌రెడ్డి గతంలో రౌడీ బాయ్స్‌, లవ్‌ మి చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు మూడో సినిమాను త్రినాథరావు నక్కినతో ప్లాన్‌ చేస్తున్నారు. గతంలో హరీష్‌ శంకర్‌ కూడా దిల్‌ రాజు బేనర్‌లో నాలుగు సినిమాలు డైరెక్ట్‌ చేశాడు. అందుకే తన వారసుడి సినిమాకి హరీష్‌ శంకర్‌తో స్క్రిప్ట్‌ సిద్ధం చేయిస్తున్నారు దిల్‌రాజు. ఆశిష్‌ రెండు సినిమాల్లో నటించినప్పటికీ హీరోగా మంచి బ్రేక్‌ రాలేదు. ఇప్పుడు మూడో సినిమాతో అతన్ని నిలబెట్టేందుకు దిల్‌రాజు ట్రై చేస్తున్నారు. మరి ముచ్చటగా మూడోసారి హీరోగా సినిమా చేస్తున్న ఆశిష్‌ ఈసారైనా బిగ్‌ సక్సెస్‌ కొడతాడేమో చూడాలి.