English | Telugu

ఈ వారం థియేటర్, ఓటిటి చిత్రాల ద్వారా మూవీ లవర్స్ కి పండుగే 

గత వారంలాగే ఈ వారం కూడా ప్రేక్షకులకి వినోదాన్ని అందించడంలో 'తగ్గేదేలే' అంటు,పలు చిత్రాలు థియేటర్, ఓటిటి వేదికగా సందడి చేయనున్నాయి.పైగా వేటికవే డిఫరెంట్ కథాంశాలతో కూడుకున్న సబ్జెట్స్ కావడంతో ప్రేక్షకులకి అన్ లిమిటెడ్ సినీ వినోదం లభించనుంది.

లాస్ట్ ఇయర్ 'క'(Ka)లాంటి డిఫరెంట్ మూవీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నహీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram).ఈ నెల 14 న 'దిల్ రుబా'(Dilruba)అనే లవ్ ఎంటర్ టైనర్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.'నా సామి రంగ' ఫేమ్ 'రుక్సర్ దిల్లాన్' హీరోయిన్ గా చేస్తుండగా,ప్రచార చిత్రాలు అయితే మూవీ పై అంచనాలని పెంచేసాయి. విశ్వ కిరణ్ దర్శకత్వాన్ని వహించాడు. ఇదే రోజు నాచురల్ స్టార్ నాని' ప్రముఖ కామెడీ నటుడు ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన 'కోర్ట్' అనే మూవీ కూడా థియేటర్స్ లో అడుగుపెట్టనుంది.కోర్ట్ డ్రామా నేపథ్యంలో సస్పెన్సు ని మేళవించి తెరకెక్కగా రామ్ జగదీష్ దర్శకుడు.హర్ష్ రోషన్,శ్రీదేవి,సాయికుమార్,రోహిణి కీలక పాత్రలు పోషించారు.ఇక ప్రియమణి, జగదీష్,విశాక్ నాయర్ ప్రధాన క్యారెక్టర్స్ లలో తెరకెక్కిన మలయాళ డబ్ మూవీ 'ఆఫీసర్' ఈ నెల 14 న విడుదల కాబోతుంది. గత నెల 7 నే విడుదల అవ్వాల్సింది.కానీ వాయిదా పడి 14 న థియేటర్స్ లోకి రాబోతుంది.

జాన్ అబ్రహం హీరోగా హిందీలో తెరకెక్కిన 'ది డిప్లొమాట్ 'అనే యాక్షన్ డ్రామా ఫిలిం కూడా ఈ నెల 14 న విడుదల కాబోతుంది.ప్రస్తుత భారత దౌత్య వేత్త 'జె పి సింగ్' నిజ జీవిత కథ ఆధారంగా డిప్లమాట్ తెరకెక్కగా సీనియర్ నటి రేవతి,సాదియ,కుముద్ మిశ్ర కీలక పాత్రలు పోషించారు.కార్తీ హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 2010 లో వచ్చిన యుగానికి ఒక్కడు మూవీ కూడా తెలుగు నాట రీరిలీజ్ కాబోతుంది.
ఓటిటి వేదికగా చూసుకుంటే సోని లైవ్ లో
మార్చి 14 న అఖిల్ అక్కినేని(Akhil akkineni)సురేందర్ రెడ్డి ల ఏజెంట్
నెట్ ఫ్లిక్స్
మార్చి 10 'అమెరికన్ మాన్ హంట్' (డాక్యుమెంటరీ సిరీస్)
అమెజాన్ ప్రైమ్
మార్చి 13 'వీల్ ఆఫ్ టైం 3 ' ఇంగ్లీష్ వెబ్ సిరీస్
మార్చి 14 'బీ హ్యాపీ' హిందీ మూవీ

జీ 5
మార్చి 14 ఇన్ గలియోన్ మే హిందీ మూవీ

ఆపిల్ టీవీ ప్లస్

మార్చి 14 'డోప్ థీఫ్' అనే అమెరికన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్

ఈటీవీ విన్
మార్చి 13 పరాక్రమం
మార్చి 14 రామం రాఘవం అనే తెలుగు మూవీలు సందడి చేయనున్నాయి.


అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.