English | Telugu

మారుతున్న తెలుగు హీరోల " కోర మీసం " కథ

కోర మీసం..మగాడికి మీసమే అందం. అది పౌరుష చిహ్నం కూడా. మీసం తామస గుణానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. కోర మీసాల్లో వివిధ రకాలున్నాయి. గుబురు మీసం, గండు మీసం, కత్తి మీసం..లాంటివి. మీసాలు మెలేయడం మగ మహారాజుల లక్షఫణం. దానితో పాటుగా తొడ చరచడం కూడానూ. ఒక్కోసారి మీసం మెలేసి, జబ్బలు చరచుకోవడం కూడా ఉంటుంది. అలాంటి మీసం తెలుగు తెరలో భాగమైంది. మీసానికి హుందాతనాన్ని, క్రేజ్‌ను తీసుకువచ్చారు మన దర్శకులు, హీరోలు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు అంతా మీసానికి బ్రాండ్ ఇమేజ్ పెంచారు. నీ అంతు చూస్తానంటూ తొడ కొట్టి మీసం మెలేసి హీరో డైలాగ్ చెబుతుంటే ఆ దర్జా వేరు, ఆ దందా వేరు. మన సినిమాల్లో మీసం తిప్పిన మొనగాళ్లు మీ కోసం.

1 ఎన్టీఆర్

తెలుగు నాట మీసకట్టును ట్రై చేసిన తొలి తరం నటులు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు. ఎన్నో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో నటించి పాత్రలకు ప్రాణప్రతిష్ట చేశారు అన్నగారు. ఆయన నటించిన పల్నాటి యుద్ధం సినిమాలో అన్నగారి మీసకట్టు ఆదిరిపోయింది ఆ రోజుల్లో అది ట్రెండ్ సెట్టర్.

2 కృష్ణ

జేమ్స్‌బాండ్, క్రైమ్ చిత్రాలకు బ్రాండ్ అంబాసీడర్ అయ్యారు సూపర్ స్టార్ కృష్ణ. 70వ దశకంలో కృష్ణకున్న మాస్ ఫాలోయింగ్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఎవరికి లేదు. ఆ టైంలో ఆయన చేసిన అల్లూరి సీతారామరాజులో కోర మీసం మెలేస్తూ చెప్పే డైలాగ్స్ తెలుగువారు మర్చిపోగలరా?

3 బాలకృష్ణ

ఈ తరంలో మీసకట్టుకు సూపర్ క్రేజ్ తీసుకువచ్చింది బాలకృష్ణే. సమరసింహారెడ్డి, సింహా, లెజెండ్, ఊ కొడతారా? ఉలిక్కి పడతారా చిత్రాల్లో ఆయన మీసకట్టు ట్రెండ్ సెట్ చేసింది. దాంతో పాటు ఇప్పుడు తన 100వ చిత్రంలోనూ కోర మీసంతో కాలుదువ్వుతున్నారు బాలయ్య.

4 వెంకటేశ్

ఫ్యామిలీ చిత్రాల హీరోగా సూపర్ స్పీడ్‌లో ఉన్న విక్టరీ వెంకటేశ్ ఎప్పుడూ క్లాస్ లుక్‌లోనే కనిపిస్తారు. అయితే ఆయన నటించిన జయం మనదేరా సినిమాలో కోర మీసంతో కనిపించి ఫ్యాన్స్‌ను ఖుషి చేశాడు.

5 నాగార్జున

టాలీవుడ్ మన్మథుడిగా అందరిని మెస్మరైజ్ చేసే కింగ్ అక్కినేని నాగార్జున కూడా మీసకట్టు ట్రై చేశారు. ఎదురులేని మనిషి సినిమాలో ఊరికి న్యాయం చెప్పే పెద్దగా కోర మీసంతో హుందాతనాన్ని చూపించారు.

6 డాక్టర్ రాజశేఖర్

ఫ్యాక్షన్ సినిమాలు రాజ్యమేలుతున్న టైంలో వచ్చిన భరతసింహారెడ్డి సినిమాలో యంగ్రీయంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ మీసకట్టు ఆదిరిపోయింది.

7 పవన్ కళ్యాణ్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అనగానే అందరికి గుర్తుచ్చేది డ్రస్సులు, బైక్స్, హేయిర్ స్టైల్, చిలిపి అల్లరి అయితే ఆయన ఫస్ట్‌టైం పోలీస్ ఆఫీసర్‌గా నటించిన కొమరం పులి సినిమాలో పవన్ కోరమీసం పెట్టుకున్నారు. దీనిని అభిమానులంతా ఫాలో అయి క్రేజ్ తీసుకువచ్చారు.

8 రవితేజ

వెరైటీ డైలాగ్ డెలీవరితో ఫుల్ జోష్‌తో ఉండే సినిమాలు చేసే మాస్ మహారాజ్ రవితేజ విక్రమార్కుడు సినిమాలో పోలీస్ ఆఫీసర్‌ గెటప్‌కు మరింత సీరియస్‌‌నెస్ తీసుకువచ్చింది ఆయన పెట్టిన మీసం.

9 జూనియర్ ఎన్టీఆర్

తాత, బాబాయి దారిలోనే నడుస్తూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్ననందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా మీస కట్టుతో ఆదరగొట్టాడు. దమ్ము సినిమాలో జమీందారుగా ఎన్టీఆర్ కోర మీసం ట్రెండ్ సెట్ చేసింది.

10 ప్రభాస్


ఆరడుగులు ఆజానుబాహుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. సీరియస్‌నెస్‌కి దూరంగా కూల్‌గా ఉండే క్యారెక్టర్లు చేసే టైంలో జక్కన్న ప్రభాస్ లుక్ మార్చేశారు. తెలుగు సినిమా స్టామినా ఎంటో ప్రపంచానికి తెలియజేసిన బాహుబలిలో ప్రభాస్ కోర మీసం ఆదుర్స్.


11 రాంచరణ్


మెగాస్టార్ నట వారసుడు రాంచరణ్ కెరిర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన మగధీరలో కాలభైరవుడిగా మీసం తిప్పాడు.


12 అల్లుఅర్జున్


తెలుగులో స్టైల్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్. తను చేసే ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్త ఫ్యాషన్‌ని అభిమానులకు పరిచయం చేసే బన్నీ తన లేటేస్ట్‌ మూవీ సరైనోడులో మీసకట్టు ట్రై చేశాడు. అల్రెడి ట్రైలర్స్‌ ద్వారా అభిమానులకు ఎప్పుడో కనెక్ట్ అయిన ఈ న్యూలుక్‌ని వాళ్లు కూడా ట్రై చేస్తున్నారు.


13 సూర్య


తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి ఫాలోయింగ్ ఉన్న నటుడు సూర్య. క్యారెక్టర్ ఏదైనా తన పర్ఫామెన్స్‌తో సినిమాను పీక్‌కు తీసుకెళ్లగల స్టార్. ఆయన నటించిన యముడు సినిమాలో మీసకట్టు ట్రై చేశాడు. పోలీస్ గెటప్‌లో పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఆయన యాక్ఠింగ్‌కు అభిమానులు ఫీదా అయిపోయారు.

14 చిరంజీవి

తన కెరిర్‌లో ఎన్నో పాత్రలు చేసిన మెగస్టార్ తన 150వ సినిమా కోసం కోర మీసాన్ని ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన గెటప్‌ అందరిని ఆకట్టుకుంటోంది. సరైనోడు ఆడియో రిలీజ్‌కు చీఫ్ గెస్ట్‌గా చిరు ఆ గెటప్‌తోనే వచ్చారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .