English | Telugu

సర్దార్ గబ్బర్ సింగ్ 11 డేస్ కలెక్షన్ రిపోర్ట్..!

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన పవర్ స్టార్ సర్దార్ గబ్బర్ సింగ్, పవన్ ఫ్యాన్స్ ను నిరుత్సాహపరిచింది. సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నా పవన్ సినిమా 50 కోట్లు దాటేసింది.! పవన్ సినిమాల్లో గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది తర్వాత ఈ క్లబ్ లో చేరిన మూడో సినిమా సర్దార్. బిల్ యావరేజ్ టాక్ తో పవన్ సినిమా 50 కోట్లు దాటిందంటే, సూపర్ హిట్ టాక్ వచ్చుంటే, సినిమా కలెక్షన్లు ఎలా ఉండేవి అనేది ఆసక్తికరం. ఇప్పటి వరకూ సర్దార్ టోటల్ కలెక్షన్ రిపోర్ట్.

నైజాం 11.42 కోట్లు
సీడెడ్ 8.12 కోట్లు
నెల్లూర్ 1.62 కోట్లు
గుంటూరు 3.90 కోట్లు
కృష్ణా 2.85 కోట్లు
పశ్చిమ గోదావరి 3.72 కోట్లు
తూర్పు గోదావరి 3.66 కోట్లు
వైజాగ్ 4.20 కోట్లు
ఆంధ్రా, తెలంగాణా షేర్ 39.49 కోట్లు
కర్ణాటక 4.48 కోట్లు
ఇండియా వైడ్ 1.45 కోట్లు
యుఎస్ 3.90 కోట్లు
ఒవర్సీస్ (యుఎస్ కాకుండా) 1.10 కోట్లు

మొత్తం 50.42 కోట్లు

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.