English | Telugu

సూపర్ స్టార్ విలన్ గా చేస్తున్నాడు..!

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ కు అక్కడ ఉన్న మాస్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. అందుకే ఈ భాయ్ నటించిన ఫ్లాప్ సినిమా కూడా ఈజీగా రికార్డ్స్ బ్రేక్ చేసేస్తుంటుంది. కానీ ఎన్ని హిట్టు సినిమాలు చేస్తున్నా, ప్రతీ హీరోకు విలన్ గా చేయాలనే కోరిక కూడా ఉంటుంది. ఇదే ఆశ సల్లూభాయ్ కు కూడా ఉందట. ఇప్పటికే ఆయనకు మిత్ర శత్రువు షారుఖ్ కూడా తన ఫ్యాన్ సినిమాలో నెగటివ్ రోల్ చేసేసి మెప్పించేశాడు. అందుకే ఈసారి ఎలాగైనా విలన్ గా కనిపించి తీరాల్సిందేనని పట్టుబట్టి, రెండు సినిమాల్లో విలన్ గా కనిపించడానికి సై అనేశాడట. రేస్ 3, ధూమ్ 4 సినిమాల్లో విలన్ పాత్రల్లో సల్మాన్ కనబడే అవకాశం ఉందంటోంది బాలీవుడ్. రేస్ 3 కు సంబంధించి రోల్ ఫిక్స్ అయిపోయిందని, ధూమ్ కోసం చర్చలు జరుగుతున్నాయని అక్కడి జనాలంటున్నారు. అంటే అభిమానులు సల్లూ భాయ్ ని విలన్ రోల్ లో చూసే రోజు మరెంతో దూరంలో లేదన్నమాట. మరి నెగటివ్ రోల్ లో సల్లూ భాయ్ ఎంతవరకూ అలరిస్తాడో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.