English | Telugu

ఏక్‌దమ్‌ మాస్‌ మహారాజా రచ్చ స్టార్ట్‌ అయ్యింది!

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ‘టైగర్‌ నాగేశ్వరరావు చిత్రానికి రోజురోజుకీ హైప్‌ పెరుగుతోంది. వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఓ వివాదం ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఆ కేసు కోర్టులో ఉంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్‌ 20న ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధమవుతుండగా, ఈ సినిమాలోని పాటలను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది యూనిట్‌. సెప్టెంబర్‌ 5న ఈ సినిమాలోని ‘ఏక్‌దమ్‌ ఏక్‌దమ్‌’ అనే పాటను విడుదల చేయబోతున్నారు. జి.వి.ప్రకాష్‌ సంగీత సారధ్యంలో ఈ పాట రూపొందింది. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌లో జి.వి.ప్రకాష్‌ మార్క్‌ సంగీతం వినిపించింది. పాటల పరంగా కూడా తప్పకుండా మంచి మ్యూజిక్కే చేసి ఉంటాడు. మాస్‌ మహారాజా కెరీర్‌లో టైగర్‌ నాగేశ్వరరావు తప్పకుండా ఒక డిఫరెంట్‌ మూవీగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.