English | Telugu

బర్త్‌ డే కి ముందు నుంచే హంగామా మొదలైపోయింది!

పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ హంగామా మొదలైంది. సెప్టెంబర్‌ 2 పవర్‌స్టార్‌ బర్త్‌డే కావడంతో ఫ్యాన్స్‌ సందడి చేస్తున్నారు. పవన్‌కల్యాణ్‌ కొత్త సినిమా ‘ఓజి’కి సంబంధించిన అప్‌డేట్స్‌ని ఎంజాయ్‌ చేస్తూనే పవర్‌స్టార్‌ బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసుకోవడానికి ప్లాన్‌ చేస్తున్నారు. పవన్‌కల్యాణ్‌ డిఫరెంట్‌ క్యారెక్టరైజేషన్‌తో, డిఫరెంట్‌ గెటప్‌తో రూపొందిన ‘గుడుంబా శంకర్‌’ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్‌ ఫ్యాన్స్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. సెప్టెంబర్‌ 2 పవర్‌స్టార్‌ పుట్టినరోజు సందర్భంగా మరికొన్ని థియేటర్లలో భారీగా ఈ సినిమా రిలీజ్‌ కాబోతోంది. ఇక ఆరోజు ఫ్యాన్స్‌ హడావిడి మామూలుగా వుండదనే విషయం ఇప్పటికే అర్థమైపోతోంది.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.