English | Telugu

థగ్ లైఫ్ ఓటిటి ఎక్కడ.. కన్నడ ప్రజలు ఏం చెయ్యబోతున్నారు  

విశ్వకథానాయకుడు 'కమల్ హాసన్'(Kamal Haasan)ఇండియన్ చిత్ర పరిశమ్ర గర్వించదగ్గ లెజండ్రీ డైరెక్టర్ 'మణిరత్నం'(Manirathnam)కాంబోలో జూన్ 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'థగ్ లైఫ్'(Thug Life). గ్యాంగ్ స్టార్ డ్రామాగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీలో శింబు(Simbu),త్రిష(Trisha)అభిరామి, నాజర్, తనికెళ్ళ భరణి, అశోక్ సెల్వన్, జోజు జార్జ్ కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విన్నర్ 'ఏఆర్ రెహ్మాన్'(Ar Rehman)సంగీతాన్ని అందించడం జరిగింది.

థగ్ లైఫ్ రిలీజ్ కి ముందు జరిగిన ప్రమోషన్స్ లో కమల్ హాసన్ మాట్లాడుతు ఎనిమిది వారాల తర్వాత మాత్రమే థగ్ లైఫ్ 'ఓటిటి' లోకి వస్తుందని చెప్పాడు. కానీ ఎటువంటి ప్రకటన లేకుండా థగ్ లైఫ్ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్(Netflix)వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న 'థగ్ లైఫ్' తెలుగు,తమిళంతో పాటు మలయాళం,కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. దీంతో ఓటిటి సినీ ప్రియులకి సరికొత్త సినీ వినోదం 'థగ్ లైఫ్ ద్వారా దొరికినట్లే. రంగరాయ శక్తివేల్ గా కమల్, అమర్ క్యారక్టర్ లో శింబు తమ క్యారెక్టర్స్ లో జీవించారు. మిగతా పాత్రల్లో చేసిన త్రిష, అభిరామి, నాజర్ తో సహా అందరు ఆయా క్యారెక్టర్స్ లో అద్భుతంగా నటించి మూవీకి నిండు తనాన్ని తెచ్చారు. మణిరత్నం కూడా తన టేకింగ్ తో మెప్పిస్తాడు. కానీ కథ, కథనాల్లోని లోపాలవల్ల సిల్వర్ స్క్రీన్ పై మెప్పించలేకపోవడంతో, పాన్ ఇండియా వ్యాప్తంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. మరి ఓటిటిలో ఏ మేర ఆదరణని పొందుతుందో చూడాలి.

ముఖ్యంగా థగ్ లైఫ్ రిలీజ్ కి ముందు చెన్నై(Chennai)వేదికగా జరిగిన ఆడియో ఫంక్షన్లో కమల్ మాట్లాడుతు కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందనే వ్యాఖ్యలు చేసాడు. దీంతో కన్నడ భాషా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చెయ్యడంతో పాటు కన్నడ నాట థగ్ లైఫ్ ని బ్యాన్ చెయ్యడంతో రిలీజ్ ఆగిపోయింది. ఈ విషయంలో కమల్ బెంగుళూరు(Bengaluru)హైకోర్ట్ లో పిటిషన్ వేసినా రిలీజ్ కి పర్మిషన్ ఇవ్వలేదు. దాంతో సుప్రీం కోర్టుకి వెళ్లడంతో రెండు వారాల తర్వాత రిలీజ్ కి పర్మిషన్ ఇచ్చింది. అప్పటికే 'థగ్ లైఫ్' రిజల్ట్ తెలిసిపోవడంతో కన్నడ ప్రజలు మూవీని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కన్నడ నాట థగ్ లైఫ్ కి ఓటిటిలో ఏ మేర ఆదరణ లభిస్తుందనే ఆసక్తి ఏర్పడింది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.