English | Telugu

సర్ ప్రైజ్.. ఏజెంట్ సీక్వెల్ లోడింగ్..!

హిట్ సినిమాకి సీక్వెల్ చేయడం కామన్ అయిపోయింది. సీక్వెల్స్ చేసి హిట్స్ అందుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఫ్లాప్స్ ని చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మరో హిట్ సినిమాకి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా ఏదో కాదు.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.

నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించిన మొదటి చిత్రం 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'. స్వరూప్‌ దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌.. 2019 జూన్ లో విడుదలై మంచి విజయం సాధించింది. నవీన్ నటన, కథాకథనాలు ఆకట్టుకున్నాయి. ఇప్పుడు హిట్ మూవీ ఏజెంట్ కి సీక్వెల్ రూపొందించే సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని వినికిడి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది అంటున్నారు.

ఏజెంట్ తర్వాత 'జాతిరత్నాలు', 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాలతో వరుస విజయాలను అందుకొని యువతకు చేరువయ్యాడు నవీన్. ప్రస్తుతం 'అనగనగా ఒక రాజు' అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఏజెంట్ సీక్వెల్ కన్ఫర్మ్ అయితే.. అనౌన్స్ మెంట్ తోనే మంచి అంచనాలు ఏర్పడతాయి అనడంలో సందేహం లేదు.

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.