English | Telugu

సినీ ప్రియులకు పండగే.. ఈ వారం థియేటర్, ఓటీటీ రిలీజులు!

సంక్రాంతి తర్వాత తెలుగు సినిమాల దృష్టి సమ్మర్ సీజన్ మీద ఉంటుంది. ఇప్పటికే సమ్మర్ సీజన్ మొదలైంది. పెద్ద సినిమాల తాకిడి లేదు కానీ.. చిన్న, మీడియం రేంజ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయి. ఈ వారం కూడా పలు చిన్న సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

ఈ వారం దాదాపు పది సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. మార్చి 15న 'వెయ్‌ దరువెయ్‌', 'రజాకార్‌', 'తంత్ర', 'షరతులు వర్తిస్తాయి', 'లంబసింగి', 'లైన్‌మ్యాన్‌', 'రవికుల రఘురామ', 'మాయ', 'మౌనం' విడుదల కానున్నాయి.

ఓటీటీలో కూడా ఈవారం సినిమాలు, వెబ్ సిరీస్ ల సందడి ఓ రేంజ్ లో ఉండనుంది.

అమెజాన్‌ ప్రైమ్‌:
లవ్ అదురా (హిందీ సిరీస్) - మార్చి 13
బిగ్‌ గర్ల్స్‌ డోంట్‌ క్రై (హిందీ సిరీస్) - మార్చి 14

నెట్‌ఫ్లిక్స్‌:
24 హవర్స్‌ విత్‌ గాస్పర్‌ (హాలీవుడ్‌) - మార్చి 14
లాల్‌ సలామ్‌ (తమిళ) - మార్చి 15
మర్డర్‌ ముబారక్‌ (హిందీ) - మార్చి 15

జీ5 :
మెయిన్ అటల్ హూన్ (హిందీ) - మార్చి 14

సోనీ లివ్‌ :
భ్రమయుగం(మలయాళం/తెలుగు) - మార్చి 15

డిస్నీ+హాట్‌స్టార్‌ :
సేవ్‌ ది టైగర్స్‌2 (తెలుగు సిరీస్‌) - మార్చి 15

జియో సినిమా:
హను-మాన్‌ (హిందీ) - మార్చి 16

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.