English | Telugu

‘మిరాయ్‌’ చిత్రానికి తేజ సజ్జ రెమ్యునరేషన్‌ ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

పది సంవత్సరాలపాటు బాలనటుడిగా ఎంతో మంది స్టార్‌ హీరోల సినిమాల్లో నటించిన తేజ సజ్జ.. ఇప్పుడు తను కూడా స్టార్‌ హీరోల సరసన చేరిపోయాడు. హీరోగా చేసిన సినిమాలు తక్కువే అయినా అతని రేంజ్‌ మాత్రం తక్కువ కాదు. యూత్‌లోనే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ విపరీతమైన ఫాలోయింగ్‌ తెచ్చుకున్నాడు తేజ. అంతకుముందు హీరోగా ఒకటి రెండు సినిమాల్లో నటించినా ‘హనుమాన్‌’తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లు కలెక్ట్‌ చేసి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది.

హనుమాన్‌లో సూపర్‌హీరోగా కనిపించిన తేజ.. ఆ వెంటనే అతనితో ‘మిరాయ్‌’ ప్రాజెక్ట్‌ సెట్‌ అయింది. ఈ సినిమాలో సూపర్‌ యోధగా ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఒక హీరోకి ఇలా వెంట వెంటనే సూపర్‌ పవర్‌ క్యారెక్టర్లు దక్కడం అనేది చాలా అరుదు. అలాంటి ప్రత్యేకమైన క్యారెక్టర్లు తేజను వరించాయి. హీరోగా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన తర్వాత నాలుగో సినిమాతోనే బ్లాక్‌బస్టర్‌ కొట్టిన తేజ.. ‘మిరాయ్‌’ మరో విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా కూడా రికార్డు కలెక్షన్లు సాధించే దిశగా పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

హనుమాన్‌ సినిమాకి తేజ రెమ్యునరేషన్‌ 2 కోట్లు. ఆ సినిమా భారీ విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ‘మిరాయ్‌’ సినిమాకి తన రెమ్యునరేషన్‌ ఎంత పెంచి ఉంటాడు అని లెక్కలు వేసి 10 కోట్లుగా డిసైడ్‌ అయ్యారు. ట్రేడ్‌ వర్గాల్లో కూడా ఇదే టాక్‌ వినిపించింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో రెమ్యునరేషన్‌ ప్రస్తావన వచ్చినపుడు తేజ చెప్పిన సమాధానం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ‘ఒక మంచి సినిమాలో నేను కూడా ఒక పార్ట్‌ అవ్వాలనుకుంటాను తప్ప రెమ్యునరేషన్‌ విషయం నేను పెద్దగా పట్టించుకోను. హనుమాన్‌ కోసం నేను పొందినదే.. ఈ సినిమాకి కూడా తీసుకున్నాను’ అన్నారు. దీన్నిబట్టి ఇన్నిరోజులుగా మీడియాలో, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న 10 కోట్ల రెమ్యునరేషన్‌ అనే వార్తలో ఎంత మాత్రం నిజం లేదనేది స్పష్టమైపోయింది. వరసగా రెండు బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చిన తేజ.. తన రెమ్యునరేషన్‌ విషయంలో నిర్మాతలకు అందుబాటులో ఉండడం అనేది శుభపరిణామంగానే చూడాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.