English | Telugu

ఎస్తర్ నొరోన్హా రెండో పెళ్లి? వరుడు అతనేనా!

'ఎస్తర్ నోరోన్హా'(ester Noronha)2019 అక్టోబర్ లో ప్రముఖ సింగర్, నటుడు నోయల్(Noyel)ని వివాహం చేసుకుంది. పట్టుమని పదహారు రోజులు కూడా ఆ ఇద్దరు కలిసి లేరు. దీంతో 2020 లో విడాకులు తీసుకున్నారు. అప్పట్నుంచి ఎస్తర్ ఒంటరిగానే ఉంటు పలు చిత్రాలతో బిజీగా ఉంటు వస్తుంది. కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతు నాకు ఒంటరిగా బతకాలని లేదు. అందమైన జీవితం కోసం మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. నాకు నచ్చిన వ్యక్తి కోసం వెతుకుతున్నాను. షోకేస్ లాంటి భర్త మాత్రం వద్దని చెప్పుకొచ్చింది. దీంతో ఎస్తర్ పెళ్లి కబురు ఎప్పుడు చెప్తుందా అని అభిమానులు వెయిట్ చేస్తు వస్తున్నారు.

నిన్న ఎస్తర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అభిమానులు ఆమెకి సోషల్ మీడియా వేదికగా తమ శుభాకాంక్షలు వెల్లడి చేసారు. ఈ క్రమంలో రీసెంట్ గా 'ఎస్తర్' సోషల్ మీడియా వేదికగా క్రిస్టియన్ పద్దతిలో ముస్తాబైన నవ వధువుగా ఒక పిక్ ని షేర్ చేస్తు 'నా జీవితంలో మరో అందమైన సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడు. అవకాశాలతో పాటు ఎన్నో అవకాశాలు ఇచ్చినందుకు కూడా దేవుడి కి కృతజ్ఞతలు. పుట్టిన రోజున విషెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీతో ప్రతేకమైన ప్రకటనని పంచుకోబోతున్నాను. న్యూ అనౌన్స్ మెంట్ కమింగ్ సూన్ అనే క్యాప్షన్ ని ఉంచింది. ఆ కమింగ్ న్యూస్ పెళ్ళికి సంబంధించిందే అని
అభిమానులు అనుకోవడంతో పాటు, తనకి నచ్చిన లక్షణాలు ఉన్న వ్యక్తి వరుడుగా రావాలని మెసేజెస్ చేస్తున్నారు..

2013 లో విడుదలైన 'వెయ్యి అబద్దాలు' అనే చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన ఎస్తర్, ఇప్పటివరకు తెలుగు, హిందీ, కన్నడ, కొంకిణి, మరాఠీ భాషల్లో సుమారు ఇరవై ఐదుకి పైగా చిత్రాల్లో చేసింది. పలు వెబ్ సిరీస్ లు కూడా చేస్తు బిజీగా ఉన్న 'ఎస్తర్' ఈ ఏడాది ఫిబ్రవరిలో 'తల' అనే మూవీతో పలకరించింది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.