English | Telugu

తీయని కలవో పాటలు విడుదల

అఖిల్ కార్తీక్, శ్రీతేజ, హుదుషా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "తీయని కలవో". బలమూరి రామమోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివాజీ యు. దర్శకత్వం వహిస్తున్నాడు. రవీంద్రప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలు ఇటీవలే హైదరాబాదులో విడుదలయ్యాయి. తొలి సిడీని హీరో సుధీర్ బాబు, నవీన్ చంద్ర ఆవిష్కరించి, దర్శకుడు శ్రీవాస్ కు అందజేసారు. అందరి మనసులను హత్తుకునే తియ్యని కల లాంటి ప్రేమకథ ఇది. రవీంద్ర మంచి పాటలు అందించాడు. వచ్చే నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తామన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని అందరు కోరారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర పోస్టర్స్ కు మంచి స్పందన వస్తుంది. పాటలు కూడా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు శ్రీవాస్ అన్నారు.