English | Telugu

మిఠాయి బ్యూటీతో మహేష్ ఆటలు

"దూకుడు" వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత శ్రీనువైట్ల, మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం "ఆగడు".ఇటీవలే మహేష్ కు షూటింగ్ సమయంలో గాయాలు తగిలిన విషయం తెలిసిందే. అయితే కొద్దిరోజులు మాత్రమే విశ్రాంతి తీసుకొని, మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర ఎం సిటీ మండువా హౌస్ ప్రాంతంలో చిత్రీకరణ జరుగుతుంది. ఇందులో మహేష్ రాయలసీమ యాసలో మాట్లాడుతూ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో తమన్నా మిఠాయి షాప్ నడిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ అమ్మడికి ఈ సినిమాలో సేవాగుణం బాగా ఎక్కువట. దాంతో ఈ అమ్మడిని మహేష్ ఎలా ఆటపట్టిస్తున్నాడో వెండితెరమీద చూస్తేనే బాగుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. 14 రీల్స్ బ్యానర్లో అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న పాటలను కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.